TDP: ఏపీలో ఎన్నికలకు సిద్ధమైన టీడీపీ.. త్వరలో అభ్యర్థుల తొలి జాబితా విడుదల!

ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. జమిలి ఎన్నికల వార్తల నేపథ్యంలో ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జోరందుకుంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. అధికార పార్టీ వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఏకంగా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించడానికి సిద్ధమైందని తెలుస్తోంది.

TDP: ఏపీలో ఎన్నికలకు సిద్ధమైన టీడీపీ.. త్వరలో అభ్యర్థుల తొలి జాబితా విడుదల!
New Update

తొలి జాబితాలో 75 మంది పేర్లు..?

ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. జమిలి ఎన్నికల వార్తల నేపథ్యంలో ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జోరందుకుంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. అధికార పార్టీ వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఏకంగా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించడానికి సిద్ధమైందని తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థులపై పూర్తి కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఉమ్మడి 13 జిల్లాల నుంచి జిల్లాకు ఐదుగురు లేదా ఆరుగురు చొప్పున తొలి జాబితాలో సెలెక్ట్ చేయనున్నారని చెబుతున్నారు. తొలి జాబితాలో 70 నుంచి 75 మంది పేర్లు ఉండనున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జనసేనకు 25-30 సీట్లు ఇచ్చే ఛాన్స్!

మరోవైపు జనసేనతో పొత్తు దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఆ పార్టీకి సీట్లు సర్దుబాటు చేసి.. మిగిలిన చోట్ల అభ్యర్థులను ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నారట టీడీపీ అధినేత చంద్రబాబు. నియోజకవర్గాల్లో ఎలాంటి వివాదాలు లేని బలంగా ఉన్న చోట్ల అభ్యర్థులను ముందు జాబితాలో సెలెక్ట్ చేయనున్నారట. పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే చర్చ కూడా నడుస్తోందట. ప్రస్తుతానికైతే 25 నుంచి 30 సీట్లు పవన్ పార్టీకి ఇవ్వడానికి అంగీకరించారట. వైసీపీని ఎలాగైనా గద్దె దించాలనే లక్ష్యంతో ఉన్న జనసేనాని టీడీపీ ప్రతిపాదనలకు అంగీకారం చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో జనసేనకు ఎక్కువ టికెట్లు ఇవ్వనున్నారట. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నుంచి తొలి జాబితా కూడా విడుదల కావొచ్చని తెలుస్తోంది.

బీజేపీ కూడా కలిస్తే 10 సీట్లకు ఓకే!

ఇక బీజేపీ కూడా తమతో కలిసి రావాలని పవన్ కల్యాణ్, చంద్రబాబు భావిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒకవేళ బీజేపీ కూడా పొత్తులో కలిస్తే ఆ పార్టీకి 10 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. మొత్తానికి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ముందుగానే అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది. అటు ఈనెల 5 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. ఇటు పవన్ కల్యాణ్ కూడా మరోసారి వారాహి యాత్రకు రెడీ అవుతున్నారు. ఇక ఇప్పటికే టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రతో ముందుకు సాగుతున్నారు. మరోవైపు పొత్తులపై కూడా దసరా లోపు క్లారిటీ రానుంది. దసరా పండుగ సందర్భంగా పూర్తి మేనిఫెస్టోను ప్రకటించనున్నామని టీడీపీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి