Ganta Srinivasa Rao: గంట మళ్లీ జంప్.. ఈ సారి పోటీ ఎక్కడినుంచంటే?

పోటీ చేసిన ప్రతీసారి ఓ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించే గంటా శ్రీనివాస రావు.. ఈ సారి కూడా తన సీటును మార్చుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి బరిలోకి దిగాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

New Update
Ganta Srinivasa Rao: గంట మళ్లీ జంప్.. ఈ సారి పోటీ ఎక్కడినుంచంటే?

Ganta Srinivasa Rao: గంటా శ్రీనివాసరావు .. ఏపీ రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు. 1999లో టీడీపీ (TDP) నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే.. టీడీపీ నుంచి పీఆర్పీ (PRP), మళ్లీ అక్కడి నుంచి కాంగ్రెస్ ఆ తర్వాత మళ్లీ టీడీపీకి.. ఇలా ఆయన రాజకీయ ప్రయాణం సాగింది. పార్టీలతో పాటు నియోజకవర్గాలను కూడా మార్చిన చరిత్ర ఆయనది. తెలుగునాట ఇన్ని నియోకవర్గాలు మార్చిన నేత ఉండకపోవచ్చని కూడా చెబుతుంటారు. పోటీ చేసిన ప్రతీ సారి ఓ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేయడం గంట స్పెషల్. కొత్త నియోజకవర్గం అయినా కూడా ప్రతీ సారి గెలవడం మరో స్పెషల్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఒకసారి ఎంపీగా, 3సార్లు ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. 1999లో గంటా పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Breaking : జగన్‌ కి మరో షాక్‌.. పార్టీని వీడనున్న మచిలీపట్నం ఎంపీ!

అప్పుడు టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీ నుంచే 2004లో చోడవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరిన గంటా.. ఆ పార్టీ నుంచి 2009లో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మారిపోయారు గంటా.
ఇది కూడా చదవండి: Vijayawada : మాకు చాలాకాలం నుంచి గొడవలున్నాయి..కేశినేని చిన్ని

అనంతరం పీఆర్పీ కోటాలో కిరణ్‌ కుమార్ రెడ్డి కేబినెట్ లో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. అయితే.. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీలో చేరిపోయారు గంటా. మరో సారి నియోజకవర్గం మార్చి భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ఆయనను కేబినెట్ లోకి కూడా తీసుకున్నారు. అయితే.. 2019 ఎన్నికల్లో మరోసారి నియోజకవర్గాన్ని మార్చేశారు గంటా శ్రీనివాసరావు.

ఈ సారి విశాఖ ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా.. గంటా మాత్రం గెలుపొందడం విశేషం. అయితే.. వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి గంటా పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. అయితే ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి గంటా పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు