TDP Devineni Smitha : విజయవాడ(Vijayawada) జిల్లా పెనమలూరు నుండి బొడే ప్రసాద్(Bode Prasad) కి టీడీపీ(TDP) టికెట్ కేటాయించడంతో చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత(Devineni Smitha) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకేందుకు టికెట్ కేటాయించలేదని ప్రశ్నించారు. ప్రతిసారి తమకు అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2009 నుండి ఒక్కసారి అయినా సీటు ఇస్తే బాగుండేదని వాపోయారు. వెన్నుపోటు రాజకీయాలు టీడీపీ లోనే ఎందుకు ఉంటున్నాయో అర్దం కావటం లేదన్నారు.
ఓటమికి కారణం వాళ్లే..
2009లో పండు ఓడిపోవడానికి టీడీపీ పార్టీ నాయకులే కారణమన్నారు. సొంత పార్టీ నాయకులే పండును ఓడించారని ఆరోపించారు. పండు చనిపోయినప్పుడు అండగా ఉంటామని చెప్పిన వారు ఇప్పుడు ఏమయ్యారని నిలదీశారు. పార్టీ అధిష్టానం ఎందుకు తప్పులు చేస్తుందని ప్రశ్నించారు. కుటుంబం అన్నాక చిన్న చిన్న తప్పులు తప్పవు.. అలానే పార్టీలో కూడా చిన్న చిన్న తప్పులు జరుగుతాయని సర్ధుకుపోయామని పేర్కొన్నారు. పండు చనిపోయినా తాము పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు ఆపలేదన్నారు.
Also Read: జగన్ కు బిగ్ షాక్.. పులివెందుల నుంచి పోటీలో వైఎస్ సునీత?
పదవుల కోసం కాదు..
2014లో మున్సిపల్ ఎన్నికలు కూడా భూజనా వేసుకుని పని చేశామని గుర్తు చేశారు. గతంలో టీడీపీ టిక్కెట్లు ఇచ్చినప్పుడు కూడా మమల్ని సంప్రదించలేదని మండిపడ్డారు. కుటుంబ సభ్యులు చనిపోయినా పార్టీ గెలుపు కోసం రోడ్ల మీద తిరిగి పని చేశామని వాపోయారు. 2024లో సీటు ఇవ్వాలని పలు మార్లు కోరామన్నారు. పండు ఆత్మశాంతి కోసమే పని చేస్తున్నామని.. పదవుల కోసం కాదని స్పష్టం చేశారు. ప్రతి గడపకు మేము తిరుగుతూనే ఉన్నామన్నారు. ఇప్పటికీ సేవా కార్యక్రమాలు ఆపలేదని చెప్పుకొచ్చారు. టికెట్ ఇచ్చే ముందు అయినా మమల్ని సంప్రదిస్తే బాగుండేదన్నారు. మచ్చలేని రాజకీయాలు చేశామని.. ఇంత చేసిన తమకు .. పార్టీ కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎందుకు తీసుకోలేదు..
తమకే అన్యాయం జరుగుతుంటే ఇక సామాన్య కార్యకర్త పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. అధిష్టానం నుండి ఎటువంటి స్పందన లేదన్నారు. నారా లోకేష్ కూడా పార్టీ కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పారని అయితే, IVRSలో మమ్మల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని నిలదీశారు. బోడె బ్లాక్ మెయిల్ చేశాడని టికెట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. రెండు రోజుల్లో భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని వ్యాఖ్యానించారు. అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతామని తేల్చిచెప్పారు.