TDP Chief Chandrababu: కేసుల్లో చిక్కుకున్న బాధితులతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు.. విడుదల చేయిస్తానని భరోసా!

అన్నమయ్య జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పోలీసులు కేసులు నమోదు చేసిన బాధిత కుటుంబాలతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం ఫోన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తాను, పార్టీ పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చు. తప్పుడు కేసులు కోర్టుల్లో నిలబడవని స్పష్టం చేశారు. కార్యకర్తల అక్రమ అరెస్టులు తనను ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం ద్వారా అందరినీ విడుదల చేయిస్తానని చెప్పారు. సాధ్యమైనంత త్వరలోనే బయటకు తీసుకువస్తామని వెల్లడించారు. అక్రమ కేసులతో వందల కుటుంబాల క్షోభకు కారణం అయిన ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు.

TDP Chief Chandrababu: కేసుల్లో చిక్కుకున్న బాధితులతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు.. విడుదల చేయిస్తానని భరోసా!
New Update

అన్నమయ్య జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పోలీసులు కేసులు నమోదు చేసిన బాధిత కుటుంబాలతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం ఫోన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తాను, పార్టీ పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చు. తప్పుడు కేసులు కోర్టుల్లో నిలబడవని స్పష్టం చేశారు. కార్యకర్తల అక్రమ అరెస్టులు తనను ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం ద్వారా అందరినీ విడుదల చేయిస్తానని చెప్పారు. సాధ్యమైనంత త్వరలోనే బయటకు తీసుకువస్తామని వెల్లడించారు. అక్రమ కేసులతో వందల కుటుంబాల క్షోభకు కారణం అయిన ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు.

పుంగనూరు, అంగళ్లు ఘటనల్లో పార్టీ అధినేత చంద్రబాబుతో సహా వందల మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 12 ఎఫ్ ఐఆర్ లు నమోదు, 317 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ లతో కేసులు బుక్ చేశారు. ఇప్పటికే 81 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.దీంతో పెద్ద ఎత్తున అరెస్టులతో బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన, ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ లో మాట్లాడి వారికి ధైర్యం ఇచ్చారు.

కాగా మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై 'యుద్ధభేరి' పేరుతో ఈ నెల 1వ తేదీన చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 9 రోజులు పూర్తి చేసుకున్న ఈ యుద్ధభేరి కార్యక్రమంలో నేటితో 10వ రోజుకు చేరుకుంది. ఈ 10వ రోజున చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గూనభద్రలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన వంశధార ప్రాజెక్టును సందర్శించి, పరిశీలించి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.

#chandrababu #tdp-chief-chandrababu #angallu-issue
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe