నాపైనే హత్యాయత్నం చేసి.. నాపైనే కేసు పెడతారా: చంద్రబాబు ఫైర్

తనపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపైనే హత్యాయత్నం చేసి.. రివర్స్ లో తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతోనే అంగళ్లలో విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లు ఘటనకు సంబంధించి వైసీపీ అరాచకాలతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరును చంద్రబాబు తప్పుపట్టారు.

New Update
'పెన్నా టు వంశధార'.. ప్రాజెక్టులపై పోరుబాటకు చంద్రబాబు సిద్ధం

తనపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపైనే హత్యాయత్నం చేసి.. రివర్స్ లో తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతోనే అంగళ్లలో విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లు ఘటనకు సంబంధించి వైసీపీ అరాచకాలతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు వివరించారు.

తనపై హత్యాయత్నానికి పోలీసులు కూడా సహకరించారని ఆరోపించారు చంద్రబాబు. తనతో పాటు తన క్యాడర్‌ పైనా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చాలా సార్లు హత్యాయత్నం చేయాలని ప్లాన్ చేశారన్నారు. రోడ్డు పైకి ఆ రోజు ఉదయం వైసీపీ వాళ్లు వస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించారు చంద్రబాబు. తనపై హత్యాయత్నం జరిగింది కాబట్టి వెంటనే సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తనను హత్య చేయాలనే వైసీపీ గూండాలు వచ్చారన్నారు. కమెండోలు పలు సార్లు తన ప్రాణాలు కాపాడారని తెలిపారు చంద్రబాబు.

తమను చంపి రాజకీయాలు చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. తనపై అనేక సార్లు ఈ విధంగా దాడులకు పాలడుతున్నారు కాబట్టి.. ఎవరు తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నారో సీబీఐ విచారణలో తేలాలన్నారు. తనపై చాలా సార్లు దాడికి యత్నించారన్నారు. తెలుగుదేశం శ్రేణులు రొడ్డెక్కకుండా ముందస్తు అరెస్టులు చేసే పోలీసులు, అంగళ్లలో వైసీపీ శ్రేణుల్ని ఎందుకు నియంత్రించలేకోయారని చంద్రబాబు నిలదీశారు.

పుంగనూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీదకు రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. దాడులపై సీబీఐతో విచారణ జరగాలన్నారు. చిత్తూరు ఎస్పీది అమానుష వైఖరని దుయ్యబట్టారు. అంగళ్లులో విధ్వంసం జరగబోతుందని పోలీసులకు ముందుగానే సమాచారం ఉందని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

కాగా అన్నమయ్య జిల్లా అంగళ్లులో చోటు చేసుకున్న ఘర్షణలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంగళ్లులో దాడిపై ఉమాపతి ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ గంగాధర్ వెల్లడించారు. ముదివీడు పీఎస్‌లో చంద్రబాబు సహా 14 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1-చంద్రబాబు, ఏ2-దేవినేని ఉమా, ఏ3-అమర్నాథ్‌ రెడ్డి పేర్లను చేర్చినట్లు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిపై దర్యాప్తు జరుగుతోందని, ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని జిల్లా ఎస్పీ అన్నారు.

Advertisment
తాజా కథనాలు