TDP Chief Chandrababu Promise as 4 Gas Cylinders Rakhi Purnima Celebrations at NTR Bhavan: తెలుగు దేశం కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాశక్తి - రక్షా బంధన్ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబుకు పీతల సుజాత, వంగలపూడి అనిత, తెలుగు మహిళలు, బ్రహ్మ కుమారీలు రాఖీలు కట్టారు. అనంతరం మహిళలకు టీడీపీ హయాంలో చేపట్టిన కార్యక్రమాల గురించి చంద్రబాబు వివరించారు.
నాలుగు గ్యాస్ సిలెండర్లు ఫ్రీ:
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అక్కలకు, చెల్లెళ్లకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు. మహిళలకు మూడు గ్యాస్ సిలెండర్లు కాకుండా అవసరమైతే మరో సిలెండర్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళలను శక్తి మంతులుగా చేయడమే టీడీపీ లక్ష్యమన్నారు. తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని సంకల్పం చేసుకుని ప్రయత్నించండని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో టీడీపీ కరెంట్ చార్జీలు పెంచదన్నారు. మహిళలకు ఎన్టీఆర్ ఆస్థి హక్కు కల్పించిన విషయం గుర్తు చేశారు చంద్రబాబు.
విజయ దశమి రోజున మహిళల సమక్షంలో పూర్తిస్థాయి మేనిఫెస్టో:
తల్లికి వందనం పేరుతో పిల్లల చదువుకు ఆర్థిక సాయం, విజయ దశమి రోజున మహిళల సమక్షంలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. ఆడ బిడ్డ నిధితో మహిళలను ఆదుకుంటామని చంద్రబాబు అన్నారు. తెలుగు మహిళను ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. బంధాలు, భారతీయ సంస్కృతికి ఉన్న ప్రత్యేకతను గుర్తు చేశారు. విదేశాల్లో కూడా భారతీయ సంస్కృతిని మెచ్చుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు.
మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్:
మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతామన్నారు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆ సంఘాలకు గౌరవం ఇచ్చింది టీడీపీనే అని పేర్కొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో ప్రతి ఆడబిడ్డ గౌరవాన్ని కాపాడాం.. గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ప్రతి ఇంటికి దీపం పెట్టించామన్నారు. ఆడబిడ్డలకు ప్రత్యేక ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయించామన్నారు. బాలింతలకు పౌష్టికాహారం, పిల్లల కోసం బేబీ కిట్లు ఇచ్చామన్నారు. పెళ్లి కానుక, తల్లికి వందనం పేరుతో కాళ్లు కడిగి ఆశీర్వాదం చేయించి సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించామన్నారు టీడీపీ నేత చంద్రబాబు.
ఇది కూడా చదవండి: ఇసుక పాలసీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు ఆందోళనలు.. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు