/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Ramoji-Rao-2-1.jpg)
Ramoji Rao, Chandrababu Bonding: రామోజీరావు, చంద్రబాబుల మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. టీడీపీ పార్టీ చంద్రబాబు చేతుల్లోకి రాక ముందు నుంచీ ఇద్దరి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్టీయార్ నుంచి టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి రావడానికి వెనుక నుంచి సహాయం చేసింది రామోజీరావే అన్న విషయం అందరికీ తెలిసిందే.
అంతేకాదు తరువాత కూడా పార్టీ వ్యవహారాల్లో, ప్రభుత్వ పాలనలో రామోజీ.. చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచారు. తన పత్రిక ద్వారా కూడా టీడీపీకి సహకారం అందించారు. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఏపీ నూతన రాజధాని పేరును అమరావతిగా రామోజీరావే సూచించినట్లు చంద్రబాబు స్వయంగా చెప్పారు. చంద్రబాబుకు ఆయన ఒక రాజగురువు అని కూడా ప్రతిపక్షాలు విమర్శించాయి.
టీడీపీలో అధికార మార్పిడి జరిగినప్పుడు రామోజీరావు, చంద్రబాబు వైపు నిల్చున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇలా తనకు గాడ్ ఫాదర్ గా వ్యవహరించి తనకు ఎప్పుడు తోడుగా నిలిచిన రామోజీరావు అంత్యక్రియల్లో చంద్రబాబు అన్నీతానై వ్యవహరించారు.
రామోజీరావు గారి అంతిమ సంస్కారాలకు హాజరై, రామోజీరావు గారి పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు గారు#RamojiRao#RamojiRaoLivesOn #NaraChandrababuNaidu pic.twitter.com/9C0A3tdXIY
— Telugu Desam Party (@JaiTDP) June 9, 2024
స్వయంగా పాడె మోసి నివాళుర్పించారు. అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉండి రామోజీరావు కుటుంబ సభ్యుల్లో ఒకరిలాగా వ్యవహరించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ముఖ్య నేతలు సైతం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రామోజీరావు మృతికి సంతాపంగా ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించిన విషయం తెలిసిందే.