Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది పర్వదినం నాడు వాలంటీర్లకు గుడ్ స్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో రూ. 10 వేలు పారితోషికం ఇస్తామన్నారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి తరపున హామీ ఇస్తున్నట్లు తెలిపారు. 2,66,000 మంది వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామన్నారు.
Also Read: ఈ పోస్ట్ కి అర్థం ఏంటి.. నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా?
జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదని..వాలంటీర్లు జగన్ ను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రజలపై అప్పుల భారం లేకుండా మెరుగైన సంక్షేమం అందించేలా ముందుకెళ్తామన్నారు. కనీసం తాగునీళ్లు ఇవ్వలేని సీఎం..మూడు రాజధానులు ఎలా పెడతాడు? అని ప్రశ్నించారు. వాలంటీర్లను రాజీనామా చేసి పార్టీకి పనిచేయమని వైసీపీ నేతలు చెబుతున్నారని అలా చేసి నష్టపోవద్దని సూచించారు.
Also Read: జనసేనకు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..!
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమిగా కలసి వస్తున్నామన్నారు. వైసీపీ వ్యతిరేక ಓటు చీలకూడదని కూటమిగా వస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం అవసరమన్నారు. సూపర్ సిక్స్ తోపాటు త్వరలోనే ఎలక్షన్ మ్యానిఫెస్టో తీసుకు వస్తామని తెలిపారు.