AP Bandh: ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్.. టీడీపీ నేతలు హౌస్‌ అరెస్ట్

ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో తెల్లవారుజామున నుంచే టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి తమ నిరసన పాటిస్తున్నారు. మరోవైపు పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.

New Update
AP Bandh: ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్.. టీడీపీ నేతలు హౌస్‌ అరెస్ట్

AP Bandh: ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో తెల్లవారుజామున నుంచే టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి తమ నిరసన పాటిస్తున్నారు. మరోవైపు పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సత్యవేడు నియోజకవర్గంలో రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. బంద్ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ (TDP) కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అటు పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.

తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జనసేన పార్టీ (Janasena Party) సంఘీభావం ప్రకటించింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు పవన్. ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ సహించదని బంద్‌లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని కోరారు.

టీడీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు సీపీఐ కూడా సంఘీభావం ప్రకటించింది. బంద్ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బంద్‌లో పార్టీ శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అలాగే లోక్‌సత్తా పార్టీ, జై భీమ్ పార్టీలు బంద్‌కు మద్దతు తెలిపాయి.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎవరైనా ఆందోళనలు, సంబరాలు చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

విజయవాడ నుంచి రాజమండ్రి జైలుకు చేరుకున్న చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించేందుకు అంగీకరించింది. భద్రతాకారణాల వల్ల రాజమండి సెంట్రల్ జైల్లో ప్రత్యేక గది కేటాయించాలని, చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది. బాబుకు ఇంటి నుంచే ప్రత్యేక ఆహారం తీసుకువచ్చేందుకు కోర్టు అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు చంద్రబాబు కోసం జైల్లోని స్నేహ బ్లాక్ లో ప్రత్యేక రూంను రెడీ చేశారు. ఆయనకు ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. జైలు దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. కాగా చంద్రబాబు వెంట ఆయన కుమారుడు లోకేష్ కూడా రాజమండ్రి వెళ్లారు.

ఇది కూడా చదవండి: ఖైదీ నెంబర్ 7691…రాజమండ్రి జైలుకు టీడీపీ అధినేత..!!

Advertisment
తాజా కథనాలు