TDP Budhavenkanna: సామాజిక బస్సు యాత్ర పేరుతో ప్రయాణిస్తున్న వారు మనుషులా? దున్నపోతులా? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టిడిపి ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ బుద్ధ వెంకన్న. తుఫాను వల్ల నష్టపోయిన రైతుల గోడు వినకుండా..నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టకుండా, బస్సు యాత్ర పేరుతో పర్యటనలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మంత్రులు గ్రామాల్లోకి వెళ్లి దండుపాలెం గ్యాంగ్ లా మారారని విమర్శలు గుప్పించారు. వాలంటీర్ల ద్వారా బాధిత రైతులను బెదిరించి మీటింగ్ లకు రావాలని ఒత్తిడి చేస్తారా అని ధ్వజమెత్తారు. మీరు మనుషులైతే రైతు బాధను అర్ధం చేసుకుని కష్టాన్ని తీరుస్తారు కానీ బెదిరించి మీటింగ్ లకు పిలవరని ఫైర్ అయ్యారు. వైసీపీ మంత్రులు ఏరైతు నైనా పరామర్శించారా? రైతులు ఏమైపోయినా పర్వాలేదా? వారి బాధలను పట్టించుకోకుండా బస్సు యాత్రలు చేస్తారా? అని నిప్పులు చెరిగారు.
Also Read: ప్లీజ్ రిషబ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. పాయల్ ట్విట్ వైరల్
టిడిపి అధికారంలో లేకపోయినా నష్టపోయిన రైతుల దగ్గరికి వెళ్లి చంద్రబాబు మాట్లాడారని..వారి సమస్యలను కేంద్రానికి తెలియపరిచారని కామెంట్స్ చేశారు. కానీ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో మొద్దు నిద్రపోతున్నారని కౌంటర్లు వేశారు. మా ఎస్సీలు మా బీసీలు మామ మైనార్టీలు అని ఎందుకు మాట్లాడతావని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీ మంత్రులని బస్సు యాత్రల పేరుతో పంపిస్తావా? ఇది బుద్ధి లేకుండా చేసే యాత్ర అని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి రోజులు లెక్కపెట్టుకుంటున్నాడని..ప్రజలకు మేలు చేద్దామనే పరిస్థితుల్లో లేడని.. బాధితులను పరామర్శించడానికి వారికి సమయం లేదని పేర్కొన్నారు. నీపాలనలో పలానా వారు రాష్ట్రంలో బాగుపడ్డారని చెప్పగలవా జగన్ అని ప్రశ్నించారు. సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణా రెడ్డి, సాయిరెడ్డి వంటి వారే బాగుపడ్డార తప్ప రాష్ట్రంలో ఎవరూ బాగుపడలేదన్నారు.
Also Read: ప్రభుత్వం ఎలా నడుపుతారో చూస్తాం.. ఇప్పుడు అసలు ఆట: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపిలో ఒక్క పరిశ్రమ బాగుందని చెప్పగలరా? రైతులు బాగున్నారని చెప్పగలరా? తడిసిన ధాన్యాన్ని ఎంతకి కొన్నారో చెప్పగలరా? దోచుకున్న దాంట్లో 10 శాతం పంచినా రైతులు బాగుపడతారని అన్నారు. వరదలు వస్తే గాలిలో వెళ్లి చూస్తావా? అని దుయ్యబట్టారు. కానీ, చంద్రబాబు మాత్రం రైతుల దగ్గరికి వెళ్లి కష్టాలు తెలుసుకున్నారని కొనియాడారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమని ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశారో వాటిని విడిపిస్తామని ధీమ వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బస్సులు యాత్ర నిర్వహిస్తున్నారని విమర్శలు సంధించారు. తెలుగుదేశం అధికారులోకి రాగానే తాడేపల్లి, ఇడుపులపాయి ప్యాలెస్ లలో దాచుకున్న డబ్బును వెలికి తీస్తామని అన్నారు.
మీరు నిజమైన మంత్రులేనని నిరూపించుకోవాలనుకుంటే బస్సు యాత్ర ఆపి రైతుల దగ్గరికి వెళ్లాలని సవాల్ విసిరారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో జగన్ రెడ్డి గురించి గొప్పగా చెప్తే ప్రజలు తరిమి తరిమి కొడతారని కౌంటర్లు వేశారు. రైతులు తీవ్రంగా నష్టపోయి బాధల్లో ఉంటే సాక్షాత్తు వ్యవసాయ మంత్రి సామాజిక బస్సు యాత్రలో పాల్గొంటారా? అని నిప్పులు చెరిగారు. సీఎం జగన్ రెడ్డి ఈసారి పులివెందులలో కూడా ఓడిపోతారని.. అందుకు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే సూచిక అని వ్యాఖ్యనించారు.