KTR: ప్రభుత్వం ఎలా నడుపుతారో చూస్తాం.. ఇప్పుడు అసలు ఆట: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందో చూస్తామని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉంది అసలు ఆట అని అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లో రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ హామీ ఏమైందని ప్రశ్నించారు. By Nikhil 13 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఈ రోజు మీడియాతో చిట్ చాట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పుడు ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress Government) ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదన్నారు. ప్రతీ ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇచ్చామన్నారు. ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నట్లు చెప్పారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?.. హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. తాము ప్రతీ ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశామన్నారు. ఇది కూడా చదవండి: Telangana new speaker:తెలంగాణ తొలి దళిత స్పీకర్ గా గడ్డం ప్రసాదరావు…బ్యాక్ గ్రౌండ్ ఇదే. రేపు గవర్నర్ ప్రసంగంలోనూ ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారన్నారు. ఓ ఎమ్మెల్యే నియోజకవర్గం లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడన్నారు. ఎలా ఇస్తారంటే ఇస్తామని చెప్తున్నాడన్నారు. ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలన్నారు. ఇప్పుడు ఉంది అసలు ఆట అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు కేటీఆర్. రెండు లక్షల రుణమాఫీ అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాందీ హామీ ఏమైందని ప్రశ్నించారు. మొదటి మంత్రి వర్గంలోనే ఆరు గ్యారంటీ లకు చట్టబద్దత తెస్తమన్న హామీ ఎక్కడ? అని అన్నారు. #ktr-chit-chat #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి