TDP : టీడీపీలో చల్లారని అసమ్మతి.. బలప్రదర్శనకు దిగిన బత్యాల..!

అన్నమయ్య జిల్లా టీడీపీలో అసమ్మతి ఏ మాత్రం చల్లారడం లేదు. రైల్వే కోడూరులో టీడీపీ అసమ్మతి నేత బత్యాల చంగల్రాయుడు బలప్రదర్శనకు దిగారు. ర్యాలీ నిర్వహిస్తూ తన బలాన్ని అధిష్టానానికి చూపించి రాజంపేట స్థానం కోసం పోరాటం చేస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
TDP : టీడీపీలో చల్లారని అసమ్మతి.. బలప్రదర్శనకు దిగిన బత్యాల..!

TDP Bathyala Changal Rayudu : అన్నమయ్య జిల్లా(Annamayya District) టీడీపీ(TDP) లో అసమ్మతి సెగ ఇంకా రగులుతుంది. రైల్వే కోడూరు(Railway Koduru) లో టీడీపీ అసమ్మతి నేత బత్యాల చంగల్రాయుడు బలప్రదర్శనకు దిగారు. రాజంపేట(Rajampet) టీడీపీ టికెట్ ఆశించిన బత్యాల చెంగల్రాయుడు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.

Also Read: పుంగనూరులో కిరణ్ కుమార్ రెడ్డి Vs పెద్దిరెడ్డి.. మాటల తూటలు!

ఈ క్రమంలోనే కోడూరు లోని వెంకయ్య స్వామి ఆలయం నుంచి లక్ష్మి ప్యారడైజ్ థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బత్యాల సొంత ఊరు కోడూరు కావడంతో తన వర్గంతో బలనిరూపణ చేసుకుంటున్నారు. తన బలాన్ని టీడీపీ అధిష్టానానికి చూపించి రాజంపేట స్థానం కోసం పోరాటం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు