Bala Krishna: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై బాలకృష్ణ ఏమన్నారంటే..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తప్పుడు కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, రేపటి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నాలుగో విడత కృష్ణా జిల్లాలో ప్రారంభం కానుంది.

New Update
Bala Krishna: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై బాలకృష్ణ ఏమన్నారంటే..!!

Bala Krishna: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తప్పుడు కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని అన్నారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్లో ఈరోజు టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాలకృష్ణతో పాటు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చంద్రబాబును కలిసి తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని కూడా ఆయన వెల్లడించారు. మరో వైపు చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తోంది . ఇందులో భాగంగా అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా భువనేశ్వరి ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు టీడీపీ నేతలు నందమూరి బాలకృష్ణ, అచ్చెంనాయుడు ప్రకటించారు. అదే రోజు సాయంత్రం ప్రతీ ఇంట్లో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులతో అందరూ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు.

మరోవైపు రేపటి నుంచి కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) వారాహి యాత్ర (Varahi Yatra) మొదలుకానుంది. ఈ సందర్భంగా వారాహి యాత్రకు పెడనలో చిల్లపల్లి శ్రీనివాస్, అమ్మిశెట్టి వాసు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సమన్వయ కర్తలుగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వారాహి యాత్ర షెడ్యూల్‌ను తెలియజేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటి నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. తొలిరోజు అవనిగడ్డలో బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో ప్రజలు, నాయకులతో సమావేశం అవుతారన్నారు. జనవాణి ద్వారా సమస్యలు అడిగి తెలుసుకుంటారన్నారు. నాలుగో తేదీన పెడనలో వారాహి యాత్ర ఉంటుందని చెప్పారు. జనసేనాధిపతికి దారి పొడవునా స్వాగతం పలికేందుకు జనం ఎదురు చూస్తున్నారన్నారు. యాత్రకు, సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఐదో తేదీన కైకలూరులో వారాహి యాత్ర కొనసాగుతుందని చిల్లపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Also Read: చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు..

Advertisment
తాజా కథనాలు