Vizag: విశాఖలో టైకూన్‌ జంక్షన్‌ తొలగింపు!

విశాఖలో గతేడాదిగా వివాదాస్పదంగా మారిన టైకూన్‌ జంక్షన్‌ డివైడర్ ను బుధవారం టీడీపీ, జనసేన నేతలు అడ్డు తొలగించారు. ఈ జంక్షన్‌ ను వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసం అప్పటి ప్రభుత్వాధికారులు, పోలీసులు కలిసి మూసేశారన్న ఆరోపణలున్నాయి

Vizag: విశాఖలో టైకూన్‌ జంక్షన్‌ తొలగింపు!
New Update

Vizag: విశాఖలో గతేడాదిగా వివాదాస్పదంగా మారిన టైకూన్‌ జంక్షన్‌ డివైడర్ ను బుధవారం టీడీపీ, జనసేన నేతలు అడ్డు తొలగించారు. ఈ జంక్షన్‌ ను వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసం అప్పటి ప్రభుత్వాధికారులు, పోలీసులు కలిసి మూసేశారన్న ఆరోపణలున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ, జనసేన నేతలు టైకూన్ జంక్షన్ పునరుద్ధరణకు కదిలారు.

బుధవారం పెందుర్తి టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నేతృత్వంలో టైకూన్ జంక్షన్ డివైడర్ ను జేసీబీ సాయంతో అడ్డు తొలగించారు. సమస్యాత్మకంగా ఉన్న ఈ డివైడర్ ను తొలగించడం పట్ల విశాఖ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక్కడికి దగ్గర్లో అనేక స్కూళ్లు ఉన్నాయని, పిల్లల్ని తీసుకెళ్లాలంటే ఇన్నాళ్లు ఈ డివైడర్ వల్ల చుట్టూ తిరిగెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడా బాధ తొలగిపోయిందని స్థానికులు తెలిపారు.

Also read: చంద్రబాబుకు శుభాకాంక్షలు సూపర్‌ స్టార్ స్పెషల్‌ విషెస్‌!

#vizag #devider #tykoon-junction #remove
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe