TDP and Janasena : టీడీపీ(TDP), జనసేన(Janasena) సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఇరు పార్టీల ముఖ్య నేతలు హాజరైయ్యారు. దాదాపు గంటన్నర సేపు వివిధ అంశాలపై చర్చించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తూ సైకోలా ప్రవర్తిస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఇతర ప్రాంతాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అంటే చి అంటున్నారని వ్యాఖ్యానించారు.
ఉమ్మడి సమావేశం..
రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వ దమన ఖండ, విధానాలపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28వ తేదీన బుధవారం తాడేపల్లి గూడెం పక్కన ప్రత్తిపాడులో టీడీపీ , జనసేన ఉమ్మడి సమావేశం ఉంటుందని వెల్లడించారు. సమావేశానికి ఇద్దరు అధినేతలు హాజరవుతున్నారని తెలిపారు. ఉమ్మడి మ్యానిఫెస్టోలో టీడీపీ 6, జనసేన 5 అంశాలు జనాలలోకి తీసుకొని వెళ్తున్నట్లు పేర్కొన్నారు. టికెట్ అంశంపై పవన్, చంద్రబాబు నిర్ణయం తీసుకొంటారన్నారు. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కలిసే ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
Also Read : ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన మాట ఏమైంది? జగన్ సర్కార్ పై రఘువీరా ఫైర్
టీడీపీ, జనసేన మధ్య వైసీపీ(YCP) గొడవలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని.. కార్యకర్తలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. టీడీపీ, జనసేన నాయకులు తీసుకొన్న నిర్ణయం స్వాగతించి సాగుతున్న వారికి కృతజ్ఞతలు చెపుతూ తీర్మానం చేశారు.5కోట్ల మంది ప్రజలు అసహించుకొనే ముఖ్యమంత్రి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరగడానికి, ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కి సహకరించాలని కోరారు.
బీజేపీ పొత్తు ఫైనల్
జనసేన పీఏసీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) మాట్లాడుతూ..సీట్లు, సమావేశాల్లో విబేధాలు లేకుండా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం(Tadepalligudem)లో ఎన్నికల శంఖారావం సభ పెడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ సమావేశానికి రావాలని పిలుపునిచ్చారు. 500 మంది ప్రత్యేక ఆహ్వానితులను పిలుస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ, జనసేన కలిసి అబ్ధతమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 6లక్షల మంది సభకు వస్తారని బీజేపీ పొత్తు ఫైనల్ అవుతుంది..త్వరలో చెబుతామని అన్నారు. పొత్తుల అంశంలో, సీట్ల కేటాయింపులల్లో ఎక్కడ గ్యాప్ లేదని సమయం ప్రకారమే జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే వాలంటీర్లని ఎన్నికల ఏజెంట్స్ గా పెట్టుకోవొచ్చు అని రెవిన్యూ శాఖ మంత్రి మాట్లాడారని అయితే, వారిపై.. ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశామని తెలిపారు.