Chandrababu Arrest: చంద్రబాబు కేసులో మరో ట్విస్ట్.. 30 నిమిషాలు టైమ్ ఇచ్చిన ఏసీబీ కోర్టు..

చంద్రబాబు కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ పత్తిపాడుకు చెందిన మహేష్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున తాను సంతకం పెడుతున్నట్లు తెలిపాడు మహేష్ రెడ్డి చేతి రాతతో కూడిన ఈ పిటిషన్ కాపీని ఏసీబీ కోర్టులో దాఖలు చేశాడు న్యాయవాది చెన్నకేశవులు.

New Update
Chandrababu Arrest: చంద్రబాబు కేసులో మరో ట్విస్ట్.. 30 నిమిషాలు టైమ్ ఇచ్చిన ఏసీబీ కోర్టు..

Chandrababu arrest Updates: చంద్రబాబు కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చంద్రబాబుకు(Chandrababu) బెయిల్ ఇవ్వాలంటూ పత్తిపాడుకు చెందిన మహేష్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త ఏసీబీ కోర్టులో(ACB Court) పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున తాను సంతకం పెడుతున్నట్లు తెలిపాడు మహేష్ రెడ్డి చేతి రాతతో కూడిన ఈ పిటిషన్ కాపీని ఏసీబీ కోర్టులో దాఖలు చేశాడు న్యాయవాది చెన్నకేశవులు. దాంతో ఇప్పటి వరకు చంద్రబాబు తరఫున పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులు కిలారు నితిన్ కృష్ణ, జి. సుబ్బారావులను పిలిపించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. ఫైనల్‌గా ఎవరు పిటిషన్ వేస్తారో తేల్చుకోవాలని స్పష్టం చేశారు జడ్జి. ఇందుకోసం 30 నిమిషాల సమయం ఇచ్చారు న్యాయమూర్తి. దాంతో ఎవరి పిటిషన్ వేయాలో తేల్చుకునే పనిలో పడ్డారు చంద్రబాబు తరఫున లాయర్స్.

చంద్రబాబుతో హైకోర్టు అడ్వకేట్ భేటీ..

ఇదిలాఉంటే.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడితో ఏపీ హైకోర్టు అడ్వకేట్‌ లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ములాఖత్ తీసుకుని వెళ్లి కలిశారు అడ్వకేట్స్. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టు న్యాయవాది చంద్రబాబును కలవడంపై చర్చ జరుగుతోంది.

లోకేష్‌ బస చేసిన ప్రాంతానికి చేరుకున్న బ్రాహ్మణి, భువనేశ్వరి..

రాజమండ్రిలో నారా లోకేష్ బస చేసిన ప్రాంతానికి చేరుకున్నారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి. రాజమండ్రి ఆర్ట్ సెంటర్ జైల్ సమీపంలో విద్యాగర్‌లో ఉన్న టిడిపి మాజీ కార్పోరేటర్ పరిమి వాసు నివాసం వద్ద లోకేష్ క్యాంపు ఏర్పాటు చేశారు. టిడిపికి చెందిన పలువురు ప్రధాన నాయకులు ఇప్పటికే లోకేష్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును కలవనున్నారు ఆయన కుటుంబ సభ్యులు.

Also Read:

Chandrababu:ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన చంద్రబాబు లాయర్లు

Ram Gopal Varma : అవ్వ!! ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా? ఆర్జీవీ మాస్ ర్యాగింగ్..

Advertisment
Advertisment
తాజా కథనాలు