తిరుమలలో కొత్త రూల్స్.. పిల్లలకు నో ఎంట్రీ

తిరుమల నడకమార్గంలో చిన్నారుల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలపై చిరుత దాడుల నేపథ్యంలో కాలిబాట మార్గంలో ఆంక్షలు విధించింది. భక్తులు ఈ ఆంక్షలు గమనించాలని కోరింది.

TTD : శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే వారికి అధిక ప్రాధాన్యత టీటీడీ ఈవో!
New Update

2 గంటల వరకు మాత్రమే.. 

అలిపిరి నడకమార్గంలో ఇటీవల చిన్నారులపై చిరుత దాడి చేయడంతో టీటీడీ అధికారులు పలు ఆంక్షలు విధించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకదారుల్లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతి ఉండదని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పిల్లలను తిరుమల నడకదారుల్లో అనుమతిస్తామని స్పష్టంచేచేశారు. 15 ఏళ్ల పైన భక్తులను మాత్రం అలిపిరి కాలిబాట మార్గంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు.. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.

పిల్లల చేతికి ట్యాగ్‌లు.. 

మరోవైపు నడకమార్గంలో వెళ్లే పిల్లల చేతికి పోలీసులు ట్యాగ్‌లు వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే సులభంగా కనిపెట్టేందుకు ఈ ట్యాగ్‌పై పిల్లల పేర్లు, ఫోన్ నెంబరు, తల్లిదండ్రుల వివరాలు, పోలీస్ విభాగం టోల్ ఫ్రీ నెంబరు ముద్రిస్తున్నారు. అలాగే ఘాట్ రోడ్లలో సాయంత్రం 6 గంటల తర్వాత బైక్స్‌ను అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రెండవ ఘాట్ రోడ్డులో చిరుత సంచారం నేపథ్యంలో నడకదారిలో సాయంత్రం వేళ భక్తులను అనుమతించడంపై పునరాలోచిస్తున్నామని తెలిపారు.

కాగా శుక్రవారం రాత్రి చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన దినేశ్ కుటుంబం తిరుమల వెళ్లేందుకు చాలా కాలం నుంచి ప్లాన్‌ వేసుకుంది. ఆ ప్లాన్‌కి తగ్గట్టుగానే ఎంతో ఆనందంగా.. భక్తిగా తిరుమల బయలుదేరింది. అలిపిరి నడకదారి మార్గంలో తిరుమలకు స్టార్ట్ అయ్యారు. నడుచుకుంటూ వెళ్తుండగా.. సడన్‌గా పాప లక్షిత తమతో లేదన్న విషయాన్ని కుటుంబసభ్యులు గమనించారు. లక్షిత ఎక్కడో తప్పిపోయి ఉంటుందని అంతా భావించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా మిస్సింగ్‌ కేసే అనుకున్నారు. తల్లిదండ్రులు కూడా పాప కనిపించలేదనే అనుకున్నారు కానీ చిరుత దాడి చేస్తుందని అసలు ఊహించలేకపోయారు. గత జూన్ నెలలో కూడా ఓ బాలుడిపై చిరుత దాడి చేసి గాయపరిచింది.

చిన్నారిపై చిరుత పులి దాడి చేసిన ఘటనపై టీటీడీ స్పందించింది. మృతురాలు లక్షిత కుటుంబానికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా..  అటవీ శాఖ నుంచి మరో 5 లక్షల రూపాయలను అందిచనున్నట్లు తెలిపింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ఒక్కొక్కరిగా రావద్దని, గుంపులుగా రావాలని సూచించింది. మరోవైపు ప్రమాదక జోన్లలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నట్లు వెల్లడించింది. కాగా దాడి జరిగిన పరిసర ప్రాంతాల్లో అధికారులు పులిని బంధించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 7వ మైల్ నుంచి నరసింహ స్వామి ఆలయం వరకూ హై అలెర్ట్ జోన్‌గా ప్రకటించింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe