Tata IPO: టాటా గ్రూప్ ఐపీవో లో సంచలనం సృష్టించింది. రెండు దశాబ్దాల తరువాత ఈ గ్రూప్ నుంచి టాటా టెక్నాలజీస్ ఐపీవోకు వచ్చింది. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏ ఐపీవోకు కూడా ఇటువంటి స్పందన రాలేదు. ఇన్వెస్టర్స్ దీనిలో ఒక్క లాట్ అయినా దక్కించుకోవాలని ఎగబడ్డారు. దీంతో ఈ ఐపీవో 70 సార్లు సబ్ స్క్రయిబ్ అయింది. ఈ IPO (Tata IPO) కోసం 1.5 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన బిడ్లు వచ్చాయి. టాటా టెక్ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (TATA Motors) అనుబంధ సంస్థ. దాదాపు 19 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ ఐపీఓతో ముందుకు వచ్చింది. 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) IPO వచ్చింది. ఈ ఐపీవోకి బిడ్డింగ్ నిన్న అంటే నవంబర్ 24న ముగిసింది. ముగిసే సమయానికి దీనిలో మొత్తం 312.42 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఈ షేర్ల ధర అప్పర్ ప్రైస్ బాండ్ దగ్గర కాలిక్యులేట్ చేస్తే ఇది 1.56 లక్షల కోట్ల రూపాయలతో సమానం. అంటే రూ.3 వేల కోట్ల కోసం ఐపీఓ వస్తే.. ఏకంగా రూ.లక్షన్నర కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. ఈ రకమైన స్పందన చాలా ఎక్కువగా చెప్పవచ్చు. కంపెనీ ఈ ఐపీఓలో ఒక్కో షేరు ధర రూ. 475- 500 గా నిర్ణయించింది.
60,850,278 షేర్లను అప్పర్ ప్రైస్ బ్యాండ్‌లో జారీ చేయడం ద్వారా ఈ ఐపీఓ(Tata IPO) ద్వారా 6 కోట్ల షేర్ల నుంచి రూ.3,042.51 కోట్లు సమీకరించాలనేది కంపెనీ ఆలోచన. ఇది పూర్తిగా ఆఫర్-ఫర్-సేల్. ప్రమోటర్ టాటా మోటార్స్ - ఇన్వెస్టర్లు ఆల్ఫా TC హోల్డింగ్స్ - టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ తమ వాటాను తగ్గించుకుంటున్నాయి. కాబట్టి కంపెనీ IPO నుంచి ఎటువంటి డబ్బు పొందదు. షేర్ల కేటాయింపు నవంబర్ 30న జరుగుతుంది. డిసెంబర్ 1 నుంచి రిఫండ్లు ప్రారంభమవుతాయి. షేర్లు ఎలాట్ అయినవారికి డిసెంబర్ 4న డీమ్యాట్ ఎకౌంట్ కు షేర్లను ట్రాన్స్ ఫర్ చేస్తారు. డిసెంబర్ 5న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో టాటా టెక్ షేర్లు లిస్ట్ అవుతాయి.
Also Read: ఆ మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా..రూ. 10 కోట్ల జరిమానా చెల్లించాల్సిందే..!!
ఇదీ టాటా టెక్నాలజీస్ స్టోరీ..
టాటా టెక్నాలజీస్ 1994లో ప్రారంభించిన ఒక గ్లోబల్ ఇంజనీరింగ్ సర్వీసుల సంస్థ. ఇది ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు - వారి టైర్-I సరఫరాదారులకు టర్న్‌కీ సొల్యూషన్‌లతో సహా ప్రోడక్ట్ డెవలప్మెంట్ అలాగే డిజిటల్ సోల్యూషన్స్ అందిస్తుంది. కంపెనీ ప్రధానంగా ఆటోమోటివ్ పరిశ్రమపై దృష్టి సారించింది. ప్రస్తుతం టాప్ 10 ఆటోమోటివ్ ER&D ఖర్చు చేసేవారిలో ఏడుగురితో ముడిపడి ఉంది. టాటా టెక్నాలజీ టాప్ 10 కొత్త ఎనర్జీ ER&D ఖర్చుదారులలో ఐదుగురితో కూడా అనుబంధం కలిగి ఉంది.
రెండు రకాల వ్యాపారాలు.. ఆదాయాలు..
- సర్వీసెస్: గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లయింట్‌లకు మెరుగైన ప్రోడక్ట్స్ రూపొందించడంలో, అభివృద్ధి చేయడంలో - డెలివరీ చేయడంలో సహాయపడేందుకు కంపెనీ అవుట్‌సోర్స్ ఇంజనీరింగ్ సేవలు అలాగే డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలను అందిస్తుంది. FY23లో సర్వీస్ లైన్ ద్వారా కంపెనీకి రూ.3,531 కోట్ల ఆదాయం వచ్చింది. H1 FY24లో రూ. 1,986 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
- టెక్నాలజీ సొల్యూషన్స్: దాని ఉత్పత్తి వ్యాపారం ద్వారా, కంపెనీ ఉత్పత్తి లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ వంటి మూడవ పక్ష సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లను విక్రయిస్తుంది. ఇది కాకుండా, ఇది కన్సల్టింగ్, అమలు, సిస్టమ్ ఇంటిగ్రేషన్ - సపోర్ట్ వంటి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కూడా అందిస్తుంది.
దాని విద్యా వ్యాపారంలో, ఇది దాని iGetIT ప్లాట్‌ఫారమ్ ద్వారా తాజా ఇంజనీరింగ్, తయారీ సాంకేతికతలలో శిక్షణను అందిస్తుంది. ఇది ప్రభుత్వ - ప్రైవేట్ రంగ ఉద్యోగులకు నైపుణ్యాన్ని పెంచుతుంది. టెక్నాలజీ సొల్యూషన్స్ విభాగం నుంచి ఎఫ్‌వై23లో కంపెనీ రూ.883 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. H1 FY24లో రూ. 540.3 కోట్ల ఆదాయం వచ్చింది.
Watch this interesting Video: