Tasty Cheese Balls : చీజ్ బాల్స్(Cheese Balls) చాలా రుచిగా ఉంటాయి. బంగాళదుంపలు(Potatoes) లేకుండా చేయడం కష్టంగా అనిపిస్తుంది. బంగాళదుంపల రుచిని ఇష్టపడని వారు పన్నీర్(Paneer) ట్రై చేయవచ్చు. అయితే ఈ సారి కొత్తగా, వెరైటీగా స్పినాచ్ చీజ్ బాల్స్ రెసిపీనీ ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము..
స్పినాచ్ చీజ్ బాల్స్ కోసం కావాల్సిన పదార్థాలు
- నాలుగు చెంచాల: మైదా
- మూడు నుంచి నాలుగు చెంచాల: వెన్న
- ఒక కప్పు ప్రాసెస్ చేసిన: చీజ్
- సన్నగా తరిగిన పాలకూర: అర కప్పు
- చిల్లీ ఫ్లేక్స్: ఒక చెంచా
- ఒరేగానో: ఒక చెంచా
- పిజ్జా మసాలా: ఒక చెంచా
- ఉప్పు: రుచికి సరిపడ
- నల్ల మిరియాల పొడి: సగం చెంచా
- బ్రెడ్ ముక్కలు సగం కప్పు వేయించడానికి
- 350 ml పాలు, నూనె
స్పినాచ్ చీజ్ బాల్స్ తయారీ విధానం
- ముందుగా పాన్ లో వెన్న(Butter) వేసి దాంట్లో మైదా వేసి వేయించాలి. ఆ మిశ్రమం క్రీమీ అయ్యే వరకు తక్కువ మంట మీద వేయించాలి. కానీ పిండి రంగు రంగు మారకూడదని గుర్తుంచుకోండి
- ఇప్పుడు ఈ పిండిలో పాలు,వెన్నె వేసి నెమ్మదిగా కలుపుతూ ఉండండి. ఇది ముద్దలు రాకుండా జాగ్రత్త వహించండి. మొత్తం 350 ml పాలను నెమ్మదిగా వేసి కలుపుకోవాలి. తద్వారా క్రీమీ సాస్ తయారవుతుంది.
- సాస్ కన్సిస్టెన్సీ క్రీమ్ లాగా ఉండాలి, సన్నగా లేదా మందంగా ఉండకూడదు. ఇప్పుడు ఈ సాస్‌లో సన్నగా తరిగిన బచ్చలికూర, ఉడికించిన మొక్కజొన్న జోడించండి. ఆ తర్వాత ఉప్పు, ఎండుమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా మసాలా వేసి కలపాలి.
- నెక్స్ట్ ఈ మిశ్రమంలో ప్రాసెస్ చేసిన చీజ్ వేసి అది కరిగే వరకు బాగా కలపాలి. ఆ తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాల్స్ లా తయారు చేసుకోవాలి.
- ఇప్పుడు బ్రెడ్‌ని గ్రైండర్‌లో వేసి ముక్కలుగా చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న బ్రేడ్ ముక్కాల పొడితో పైన చేసి పెట్టుకున్న బాల్స్ కోట్ చేయాలి.
- బ్రేడ్ ముక్కల పొడిలో డిప్ చేసిన ఈ చీజ్ స్పినాచ్ బాల్స్ నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే స్పినాచ్ చీజ్ బాల్స్ రెడీ. వీటిని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు.
Also Read: Coolest Places: మండే వేసవిలో కూడా వణికిపోతారు… భారతదేశంలో అత్యంత చల్లని ప్రదేశాలు..!