Spinach Cheese Balls : టేస్టీ స్పినాచ్ చీజ్ బాల్స్.. పిల్లలు బాగా ఇష్టపడతారు సహజంగా చీజ్ బాల్స్ చేయడానికి ఎక్కువగా బంగాళదుంపలను ఉపయోగిస్తారు. అయితే బంగాళదుంపల రుచిని ఇష్టపడని వారు ఈ సారి కొత్తగా, వెరైటీగా స్పినాచ్ చీజ్ బాల్స్ ట్రై చేయండి. పూర్తి రెసిపీ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 23 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Tasty Cheese Balls : చీజ్ బాల్స్(Cheese Balls) చాలా రుచిగా ఉంటాయి. బంగాళదుంపలు(Potatoes) లేకుండా చేయడం కష్టంగా అనిపిస్తుంది. బంగాళదుంపల రుచిని ఇష్టపడని వారు పన్నీర్(Paneer) ట్రై చేయవచ్చు. అయితే ఈ సారి కొత్తగా, వెరైటీగా స్పినాచ్ చీజ్ బాల్స్ రెసిపీనీ ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము.. స్పినాచ్ చీజ్ బాల్స్ కోసం కావాల్సిన పదార్థాలు నాలుగు చెంచాల: మైదా మూడు నుంచి నాలుగు చెంచాల: వెన్న ఒక కప్పు ప్రాసెస్ చేసిన: చీజ్ సన్నగా తరిగిన పాలకూర: అర కప్పు చిల్లీ ఫ్లేక్స్: ఒక చెంచా ఒరేగానో: ఒక చెంచా పిజ్జా మసాలా: ఒక చెంచా ఉప్పు: రుచికి సరిపడ నల్ల మిరియాల పొడి: సగం చెంచా బ్రెడ్ ముక్కలు సగం కప్పు వేయించడానికి 350 ml పాలు, నూనె స్పినాచ్ చీజ్ బాల్స్ తయారీ విధానం ముందుగా పాన్ లో వెన్న(Butter) వేసి దాంట్లో మైదా వేసి వేయించాలి. ఆ మిశ్రమం క్రీమీ అయ్యే వరకు తక్కువ మంట మీద వేయించాలి. కానీ పిండి రంగు రంగు మారకూడదని గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ పిండిలో పాలు,వెన్నె వేసి నెమ్మదిగా కలుపుతూ ఉండండి. ఇది ముద్దలు రాకుండా జాగ్రత్త వహించండి. మొత్తం 350 ml పాలను నెమ్మదిగా వేసి కలుపుకోవాలి. తద్వారా క్రీమీ సాస్ తయారవుతుంది. సాస్ కన్సిస్టెన్సీ క్రీమ్ లాగా ఉండాలి, సన్నగా లేదా మందంగా ఉండకూడదు. ఇప్పుడు ఈ సాస్‌లో సన్నగా తరిగిన బచ్చలికూర, ఉడికించిన మొక్కజొన్న జోడించండి. ఆ తర్వాత ఉప్పు, ఎండుమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా మసాలా వేసి కలపాలి. నెక్స్ట్ ఈ మిశ్రమంలో ప్రాసెస్ చేసిన చీజ్ వేసి అది కరిగే వరకు బాగా కలపాలి. ఆ తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాల్స్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌ని గ్రైండర్‌లో వేసి ముక్కలుగా చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న బ్రేడ్ ముక్కాల పొడితో పైన చేసి పెట్టుకున్న బాల్స్ కోట్ చేయాలి. బ్రేడ్ ముక్కల పొడిలో డిప్ చేసిన ఈ చీజ్ స్పినాచ్ బాల్స్ నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే స్పినాచ్ చీజ్ బాల్స్ రెడీ. వీటిని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. Also Read: Coolest Places: మండే వేసవిలో కూడా వణికిపోతారు… భారతదేశంలో అత్యంత చల్లని ప్రదేశాలు..! #paneer #potatoes #spinach-cheese-balls మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి