తాప్సీ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అక్కర్లేని పేరు. ఝమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చి..టాలీవుడ్ అందినకాడికి అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే ఆమె నటించిన సినిమాలు ఏవి కూడా అంత పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి.
దీంతో తాప్పీ గో టు బాలీవుడ్ అంటూ బాలీవుడ్ కి చెక్కేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. గత కొంత కాలం నుంచి తాప్సీ ఏది మాట్లాడిన ముక్కుసూటితనంగా ఉండటంతో ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తున్నారని చెప్పుకొవచ్చు.
తాప్సీ తాజాగా తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేసే సమయంలో వరుసగా ఫ్లాప్స్ వెంటాడాయి. ఆ సమయంలో నా పై చాలామంది ఎన్నో విమర్శలు చేశారు. సినిమా హిట్ అయితే క్రెడిట్ హీరోకి..ఫ్లాప్ అయితే హీరోయిన్ కి అంటగడుతున్నారు.
ఫ్లాప్ అయితే ఆ తప్పు హీరోయిన్ల పైన ఎందుకు వేస్తున్నారని ఈమె ప్రశ్నించారు. సినిమా ఫ్లాప్ అవ్వడానికి హీరోయిన్తే ఎందుకు కారణమవుతున్నారని అడిగారు. నాకు బ్యాగ్రౌండ్ లో ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల..ఎలాంటి సినిమాలు తీసుకోవాలో కూడా తెలియదు. అందుకే నా సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి.
ప్రస్తుతం తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని తెలిపారు.కెరియర్ మొదట్లో ఇలాంటి విమర్శల కారణంగా చాలా బాధపడ్డారని ప్రస్తుతమైతే ఇలాంటి వాటి గురించి అసలు ఆలోచించడం కూడా లేదు అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.