/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/uday-jpg.webp)
Udhayanidhi Stalin: ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) దే. ఆయన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అనడంతో రాజకీయ వర్గాల్లోనే కాకుండా , దేశ వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేగింది. అంతటితో ఆగకుండా స్టాలిన్ తల నరికి తీసుకుని వస్తే రూ. 10 కోట్ల రూపాయల నజరానా ఇస్తానని ఓ అయోధ్య సాధువు కూడా చెప్పారు.
అంతే కాకుండా ఎవరు తీసుకుని రాని పక్షంలో అతని తలను నేనే నరుకుతాను అంటూ ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. కేవలం అయోధ్యలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఉదయ్ నిధి మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: ద్రవిడ, సనాతన మధ్య ఈ వైరం ఎందుకు? చరిత్ర ఏం చెబుతోంది?
అసలేం జరిగిందంటే..రెండు రోజుల క్రితం చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని (Sanathana Dharma )డెంగ్యూ, మలేరియాలతో పోల్చుతూ..దానిని తరిమికొట్టాలన్నారు. సనాతనం అనేది సమాజానికి వ్యతిరేకమని దీనిని వ్యతిరేకించడం ఒక్కటే సరిపోదు..పూర్తిగా నిర్మూలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మంత్రి.
ఈ వ్యాఖ్యలు పలు హిందూ సంఘాలు ఫిర్యాదులు కూడా చేశాయి. ఓ సుప్రీం కోర్టు న్యాయవాది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. బీజేపీ (BJP) నేతలు కూడా ఈ అంశం గురించి స్పందించారు.
అయితే తన తల నరికి తీసుకుని వస్తాను అన్న సాధువు చేసిన వ్యాఖ్యల గురించి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ఆయన సాధువు వ్యాఖ్యలు చాలా తేలికగా తీసుకున్నట్లు తెలుస్తుంది. తన తల తీసేందుకు పది కోట్ల రూపాయలు ఇస్తానంటున్నారని..కానీ తల దువ్వుకునేందుకు అన్ని కోట్ల రూపాయలు అవసరం లేదు..కేవలం పది రూపాయలు ఉంటే చాలు.మంచి దువ్వెన వస్తుంది దానితో తల దువ్వుకోవచ్చని ఆయన వివరించారు.
తమిళ్ లో చాప్, స్లైస్ అనే పదాలకు జుట్టు దువ్వడమనే అర్థం ఉంది. కాబట్టి స్టాలిన్ ఇలా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. తనకి, తన కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు ఏమి కొత్త కాదని ఆయన అన్నారు.
Also Read: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై సుప్రీం జోక్యం చేసుకోవాలి.. సీజేఐకి 262 మంది ప్రముఖుల లేఖ.!!