చెన్నైలో యూటర్న్‌ వంతెన..ప్రారంభించిన స్టాలిన్‌!

చెన్నై నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీరడానికి , యూటర్న్‌ తీసుకోవడానికి ఇబ్బంది పడే వారికి చెన్నై నగర పాలక సంస్థ ఓ చక్కటి పరిష్కారాన్ని అందించింది. రహదారి పై యూటర్న్‌ కోసం పై వంతెన నిర్మించి ఈ సమస్యకు చెక్‌ పెట్టింది

New Update
చెన్నైలో యూటర్న్‌ వంతెన..ప్రారంభించిన స్టాలిన్‌!

చెన్నై నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు ఏవిధంగా ఉంటాయో తెలిసిందే. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండటంతో కాలేజీ స్టూడెంట్లు, ఉద్యోగస్తులు నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులను ఎదుర్కొవాల్సిందే. ఎక్కడైనా ఒకచోటు యూటర్న్‌ తీసుకోవాలంటే కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది.

అందుకే ఆ సమస్యలన్నిటికి చెక్‌ పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. రహదారి పై యూటర్న్‌ కోసం పై వంతెన నిర్మించి ఈ సమస్యకు చెక్‌ పెట్టింది చెన్నై నగరపాలక సంస్థ.

దీనిని తమిళనాడు ముఖ్యమత్రి వర్చువల్‌ గా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. దీనిని చూసిన కొందరు హైదరాబాద్ వాసులు ఇక్కడ కూడా ఇలాంటి వంతెన నిర్మిస్తే బాగుండు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

చెన్నై ఐటీ కారిడార్‌గా పాత మామల్లపురం రోడ్డు గా ఉన్న రాజీవ్ గాంధీ రోడ్డును 18.15 కోట్ల వ్యయంతో నిర్మించారు. రోడ్డుపై ట్రాఫిక్‌ను మెరుగుపరిచేందుకు 'U' ఆకారంలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను నిర్మించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

Also read: బర్త్‌ డే కి దుబాయ్ తీసుకెళ్ల లేదని భర్త పై పిడిగుద్దులు కురిపించిన భార్య..భర్త మృతి!

Advertisment
తాజా కథనాలు