Kollywood Actor Vishal : తమిళ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు విశాల్‌పై నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. విశాల్‌తో సినిమాలు తీయాలనుకునే దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లందరూ తమ అనుమతి తీసుకోవాలని నిర్మాతల మండలి ఆదేశించడం కలకలం రేకెత్తిస్తోంది. దీంతో కోలీవుడ్‌లో ఈ ఇష్యూ హాట్‌టాపిక్‌గా మారింది. విశాల్‌ను తమిళ ప్రొడ్యూసర్స్ టార్గెట్ చేశారు.
2017-19లో విశాల్ నిర్మాత మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. రూ.12కోట్లు దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాల్ సినిమాలో ఎవరు పనిచేయొద్దంటూ ఓ లేఖను రిలీజ్ చేశారు. ఇకపై విశాల్ సినిమాకు పనిచేయాల్సి వస్తే. నిర్మాతల మండలి పర్మిషన్ కంపల్సరీ అంటూ కొత్త రూల్ పెట్టారు. కాగా నిర్మాతల మండలి నిర్ణయంపై విశాల్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
Also Read : ‘డబ్బింగ్ ఆర్టిస్ట్’ నుంచి ‘డైలాగ్ కింగ్’ వరకు.. సాయి కుమార్ సినీ ‘ప్రస్థానం’ ఇదే..!
తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఎవరెన్ని అనుకున్నా సినిమాలు చేస్తూనే ఉంటానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరోవైపు విశాల్ ను తమిళ నిర్మాతలు టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం అతను ఇటీవల అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలే అని చెబుతున్నారు.
ఇటీవల విశాల్ ఇండస్ట్రీలో ప్రభుత్వ పెత్తనం నడుస్తోందంటూ హాట్ కామెంట్స్ చేశాడు. రాజకీయ నాయకులు నటులుగా మారిపోవడం.. నటులు రాజకీయ నేతలుగా మారుతున్నానంటూ.. సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యనించాడని, అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే విశాల్‌ను ఇలా టార్గెట్ చేస్తున్నారంటూ కోలీవుడ్‌లో వాదనలు వినిపిస్తున్నాయి.