Tamil Hero Vijay Kanth: ఎలా ఉండే విజయకాంత్‌..ఎలా ఐపోయాడో చూడండి.. కన్నీళ్లు ఆగవు

తీవ్ర అనారోగ్యానికి గురై ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తమిళహీరో విజయకాంత్‌ తన పార్టీ(DMDK) కార్యకర్తల ముందుకు వచ్చారు. అసలు నడవలేని.. లేవలేని స్థితిలో ఉన్న తమ అభిమాన హీరోని చూసిన ప్రజలు చాలా బాధపడుతున్నారు.

Tamil Hero Vijay Kanth: ఎలా ఉండే విజయకాంత్‌..ఎలా ఐపోయాడో చూడండి.. కన్నీళ్లు ఆగవు
New Update

Tamil Hero Vijay Kanth: తమిళ్ యాక్టర్ విజయ్ కాంత్ సినిమా రంగంలో గొప్ప నటుడిగా గుర్తింపు పొందారు. 40 ఏళ్ల విజయకాంత్ సినీ జీవితంలో 100 పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. చిత్ర పరిశ్రమలో గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన విజయకాంత్ 2005లో DMDK పార్టీనీ స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కొంత కాలం పాటు రాజకీయ రంగంలో చురుకుగా రాణించిన విజయ్ కాంత్ కొద్దీ రోజుల క్రితం అనారోగ్య సమస్యతో హాస్పిటల్ లో చేరినట్లు తెలిసింది.

publive-image

Also Read: Thandel: నాగ చైతన్య ‘తండేల్’ షూటింగ్.. ఎక్కడో తెలుసా..?

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నటుడు విజయ్ కాంత్ చెన్నైలోని మయత్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందినట్లు సమాచారం. అనారోగ్య సమస్య నుంచి కాస్త కోలుకున్న విజయ్ కాంత్ తాజాగా మీడియా ముందు కనిపించారు. తమ పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా హాజరయ్యారు. ప్రేక్షకులు తమ అభిమాన నటుడ్ని పూల మాలతో స్వాగతించారు. వీల్ చైర్ పై నడవలేని పరిస్థితుల్లో తమ ప్రియమైన నటుడు విజయ్ కాంత్ ను చూసిన అభిమానులు బాధను వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎంతో హుందాగా కనిపించే విజయ్ కాంత్ ను నడవలేని పరిస్థితిలో చూడడం బాధగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. మరి కొందరు కొందరు ఆయన మెడలో వేసిన పూలమాల పై కోపాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వ్యక్తి మెడలో అంత పెద్ద బరువైన మాల వేయడం సరి కాదని.. అది తనకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఎలా ఉండే విజయకాంత్‌ ఎలా ఐపోయాడో అంటూ భావోద్వేగానికి గురవుతున్నారు.

publive-image

Also Read: Hi Nanna: ‘హాయ్ నాన్న’ కలెక్షన్ జోరు కొనసాగుతుందా..?

#tamil-hero-vijaykanth
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి