అతడితో డేటింగ్ చేస్తున్నా.. ఎట్టకేలకు పెదవి విప్పిన తమన్నా....

New Update

publive-image

గతకొన్ని రోజులుగా టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. విజయ్ వర్మతో తనకున్న రిలేషన్‌పై తమన్నా ఎట్టకేలకు పెదవి విప్పింది. విజయ్ తో రిలేషన్ షిప్ వాస్తవమేనని ఒప్పుకుంది. న్యూ ఇయర్‌ పార్టీలో వీరిద్దరూ ముద్దుపెట్టుకున్న వీడియో వైరల్ అయింది. దాంతో వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ బాలీవుడ్, టాలీవుడ్ సహా సోషల్ మీడియా సైతం కోడై కూసింది. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి పలు పార్టీలకు అటెండవుతూ మీడియా కంటపడ్డారు. ఈ విషయంపై ఎన్నిసార్లు అడిగినా వీళ్లిద్దరు స్పందించలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ వర్మతో తనకున్న బంధంపై తమన్నా ఎట్టకేలకు పెదవి విప్పింది. విజయ్ తో రిలేషన్ షిప్ నిజమేనని ఒప్పుకుంది. ‘లస్ స్టోరీస్ 2’సెట్స్ లో తమ ప్రేమ కథ మొదలైందని వెల్లడించింది. ఈ మూవీలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంట మధ్య పరిచయం ఏర్పడి.. అదికాస్తా ప్రేమగా మారినట్లు తెలిపింది.అయితే 2017 డిసెంబరు 21 తెలుగులో నాని నటించిన MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రంలో విజయ్ విలన్‌ రోల్లో నటించి తన నటనతో ఆడియెన్స్‌ని మెప్పించాడు.

చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. విజయ్ వర్మతో రిలేషన్ షిప్ పై మాట్లాడారు. ‘సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నాకు చాలా మంది సహనటులు ఉన్నారు. కానీ విజయ్ ప్రత్యేకమైన వ్యక్తి. నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం నాకుంది. నా మనసుకు దగ్గరైన వ్యక్తి. నాపట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. తనున్న చోటే నాకు సంతోషకరమైన ప్రదేశం’అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈ భామ..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్‌’సహా టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలతో బిజీగా ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు