ట్రాన్స్ జెండర్ గా అదరగొట్టిన సుస్మితా సేన్! ఇది ఒక ట్రాన్స్ జెండర్ కథ. దీనిలో మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ ట్రాన్స్ జెండర్ గా నటించింది. ఈ సినిమా ఆగస్ట్ 15 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవ్వనుంది. By Bhavana 08 Aug 2023 in సినిమా New Update షేర్ చేయండి ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్ లు చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల వెబ్ సిరీస్ లు చూసేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటీటీ ప్లాట్ ఫామ్ లు కూడా కొత్తకొత్త కథలతో వెబ్ సిరీస్ లు తీసుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే జాతీయ దర్శకుడు రవి జాదవ్ తెరకెక్కించిన కొత్త వెబ్ సిరీస్ తాళి. ఇది ఒక ట్రాన్స్ జెండర్ కథ. దీనిలో మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ ట్రాన్స్ జెండర్ గా నటించింది. ఈ సినిమా ఆగస్ట్ 15 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవ్వనుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందించినట్లు దర్శకుడు చెబుతున్నారు. ఈ సిరీస్ లో సుస్మితా గెటప్ చాలా ఆసక్తిగా ఉంది. ట్రాన్స్ జెండర్ల హక్కుల పోరాటం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ కథ ఉండనుంది. నా దగ్గరకు మొదట ఈ కథ వచ్చినప్పుడు మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నట్లు సుస్మితా చెబుతుంది. కథకు తగినట్లుగా తనను తాను ట్రాన్స్ ఫర్ చేసుకోవడానికి సుమారు 6 నెలల సమయం పట్టినట్లు ఆమె వివరించింది. ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం పోరాటం చేసిన శ్రీగౌరీ సావంత్ చాలా గౌరవనీయమైన వ్యక్తి. ఆమె కథే తాళి. ఈ సిరీస్ ని నిర్మించడానికి కొన్ని రోజుల ముందు ఆమెతో కలిసి ట్రావెల్ చేశాను. ఆ రోజులు చాలా అదృష్టంగా భావిస్తున్నానని సుస్మితా సేన్ వివరించింది. నా నిజ జీవిత పాత్రలో సుస్మితా సేన్ చాలా బాగా యాక్ట్ చేశారని గౌరీ సావంత్ చెప్పారు. నా కథను ఒక వెబ్ సిరీస్ గా తీయడం ఆనందం కలిగించిందని సంతోషం వ్యక్తం చేశారు. తాళి వెబ్ సీరీస్ ట్రాన్స్ జెండర్ల పట్ల అందరూ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తుంది. దీనివల్ల కొంతలో కొంత అయినా ప్రజల్లో మార్పు వస్తుందని సీరీస్ టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ‘తాళి’ ఫస్ట్ లుక్ పోస్టర్ పై విమర్శలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాల గురించి సుస్మిత తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. “సోషల్ యాక్టివిస్ట్, ట్రాన్స్ జెండర్ శ్రీగౌరి సావంత్ జీవిత కథ ఆధారంగా ‘తాళి’ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో నేను మెయిన్ రోల్ పోషిస్తున్నాను. ఈ సిరీస్ కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇన్ స్టాలో రిలీజ్ చేసినప్పుడు చాలా మంది నెటిజన్లు నా గురించి మాట్లాడారు. అసభ్యంగా కామెంట్స్ పెట్టారు. వాటిని చూసి షాక్ అయ్యాను. ఇతరుల గురించి ఇంత చెత్తగా ఎలా మాట్లాడుతున్నారు? అనుకున్నాను. సభ్యత లేని వారిని బ్లాక్ చేశాను” అని తెలిపారు. #bollywood #susmithasen #transgender #taali #web-series మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి