Andhra Pradesh: మరోచోట వైసీపీ కార్యాలయం కూల్చివేత.. పార్టీ శ్రేణులు ఆందోళన
తూర్పుగోదావరి జిల్లా కడియంలో ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని.. గ్రామ పంచాయతీ అధికారులు దాన్ని కూల్చివేశారు. రైతు బజార్ కోసం షెడ్డు నిర్మాంచామని వైసీపీ నేత గిరిజాల బాబు వాదించగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు.