Chitti Babu: వైసీపీ ఎమ్మెల్యేకు బ్రెయిన్ స్ట్రోక్.. ప్రస్తుతం అబ్జ్వరేషన్‌లో..!
వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు...తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కుడికాలు లాగడంతో కుటుంబ సభ్యులు రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి "మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్" గా నిర్దారించడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులో హుటాహుటిన హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు. కొండేటి చిట్టిబాబు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... పి.గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.