Pawan Kalyan : నాకు సినిమాలే ఇంధనం: పవన్ కల్యాణ్!
నేను రాజకీయ పార్టీని నడపాలంటే నాకు సినిమాలే ఇంధనమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం గాజువాక లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
నేను రాజకీయ పార్టీని నడపాలంటే నాకు సినిమాలే ఇంధనమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం గాజువాక లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
పార్లమెంట్ సాక్షి గా వెల్లడైన వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే.. షాక్ కి లోనవ్వడం ఖాయం. 2019వ సంవత్సరంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై 431 కేసులు నమోదు కాగా, 2020లో 602 కేసులు, 2021లో 1085 కేసుల నమోదయ్యాయి. అన్ స్టార్డ్ ప్రశ్నకు రాజ్యసభ పై గణాంకాలను వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్ మాదకద్రవ్యాల హబ్ గా మారిందని ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఈ గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి. మరి దీనిపై జగన్ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు వార్ నడుస్తోంది. అమలాపురం సీఎం జగన్ పర్యటన సందర్భంగా మంత్రి విశ్వరూప్ కుటుంబంలో ఫ్లెక్సీలు వార్ నెలకొంది. మంత్రి కుమారులు వేరువేరుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మంత్రి విశ్వరూప్ ఫోటో కనిపించపోవటంతో ఇప్పుడు ఫ్లెక్సీల అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించే క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు కూడా అంగళ్లులో తన పై జరిగింది హత్యాయత్నమేనని ఆరోపించారు. దీని గురించి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బీజేపీ ఏపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత పురంధేశ్వరి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఏపీ పాలన ప్రభుత్వం పై నిత్యం ఏదోక రూపంలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆమె మరికొన్ని ట్విట్టస్త్రాలు సంధించారు.
మంత్రి అంబటి రాంబాబుకు మెగాస్టార్ చిరంజీవి పరోక్షంగా కౌంటర్లు వేశారు. పేదల కడుపునింపడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నేతలు దృష్టి పెట్టాలని.. అంతేకాని పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా సినీ ఇండస్ట్రీ గురించి ఎందుకంటూ ప్రశ్నించారు. ఇటివలి 'బ్రో' సినిమా గురించి అంబటి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెను దుమారాన్ని రేపాయి. పవన్ రెమ్యూనరేషన్ చెప్పాలంటూ అంబటి అడగడం.. 'బ్రో' సినిమా పెట్టుబడులపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయడం లాంటి పరిణామాల తర్వాత చిరు వ్యాఖ్యలు పవన్‌కు మద్దతుగా నిలుస్తుండడం మెగా ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తోంది.
ఏపీలో ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రియాశీలక నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డబ్బు తీసుకుని సీట్లు ఇచ్చే సంస్కృతి జనసేనలో లేదన్నారు.
గన్నవరం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. 2019 ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గెలుపుపై వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిగ్గింగ్ చేసో.. దొంగ ఓట్లతోనే కారణాలు ఏమైనా ఎమ్మెల్యేగా వంశీ గెలిచారంటూ ఆరోపణలు చేశారు. అమెరికాలో ఉన్న తనను గన్నవరం తీసుకొచ్చిన జగన్ రోడ్డు మీద పడేస్తారని అనుకోవడం లేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి సీటు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.