YS Sharmila: కేసీఆర్ అందుకే ఇలా చేస్తున్నాడు.. షర్మిల షాకింగ్ కామెంట్స్!
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కు ఎన్నికల్లో గెలిచేందుకు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కు ఎన్నికల్లో గెలిచేందుకు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు వైఎస్ షర్మిల నేరుగా రంగంలోకి దిగారు. రేవంత్‌కు వ్యతిరేకంగా కామారెడ్డిలో పోటీకి సిద్ధమైన వైఎస్ఆర్టీపీ నేత నీలం సుధాకర్‌ను హైదరాబాద్ పిలిచి మాట్లాడారు. పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారు. దాంతో సుధాకర్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల. 'నేను తినను.. ఇంకొకరిని తిననివ్వను అన్న మోదీకి ఇప్పుడు ఏమైంది. కేసీఆర్ మొత్తం తింటూనే ఉన్నారు.. మోదీ చూస్తేనే ఉన్నారు.. మరి ఏం చేస్తున్నారు మీరు' అంటూ ప్రదాని మోదీని ప్రశ్నించారు షర్మిల.
షర్మిలకు బిగ్ షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. సొంత ప్రయోజనాల కోసమే షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆరోపించారు. ఈరోజు గట్టు రామచంద్రరావు నేతృత్వంలో వైఎస్సార్టీపీకి మూకుమ్మడిగా తమ రాజీనామాలు ప్రకటించారు. షర్మిలను రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతామని హెచ్చరించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై షర్మిల మరో సారి సంచలన వాఖ్యలు చేశారు. పదవి పోతుందన్న భయంతోనే తనను అడ్డుకున్నాడంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో తాను పార్టీ పెట్టినప్పుడు సంబంధం లేదన్న సజ్జల ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.
తెలంగాణ ఎన్నికల బరిలోంచి వైఎస్ షర్మిల తప్పుకోవడం వెనుక పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యూహం ఉందట. ఆయన వల్లే వైఎస్ షర్మిల పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ప్రకటించారు. ఖమ్మం పార్లమెంట్ నుంచి షర్మిల్ పోటీ చేస్తారని సమాచారం.
వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వేధించిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని షర్మిల నిర్ణయం తీసుకోవడం ఆమె ఇష్టమన్నారు. జగన్ పై కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసులు పెట్టిన విషయం అందరికీ తెలుసన్నారు.
ఇన్నాళ్లూ పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పిన వైఎస్ షర్మిల.. తాజాగా తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని ఆమె డిసైట్ అయినట్లు సమాచారం. పాలేరు నుంచి వైఎస్ విజయమ్మను బరిలోకి దించాలని షర్మిల నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనతో కొత్తగూడెం నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అక్కడ పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ కాకుండా సీపీఐ పోటీ చేస్తుండడంతో.. హస్తం పార్టీ ఓటు బ్యాంకు అంతా తన వైపు కన్వర్ట్ అవుతుందని షర్మిల స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.