ఖబడ్దార్ పెద్దిరెడ్డి.. మళ్లీ పుంగనూరు వస్తా.. చంద్రబాబు సవాల్
పుంగనూరు ఒక్కసారిగా రణరంగంగా మారింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. వైసీపీ నేతల దాడిలో పలువురు టీడీపీ నేతలు, పోలీస్ అధికారులు గాయపడ్డారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా ఉన్న పుంగనూరును చంద్రబాబు హింసాకాండగా మార్చారన్నారు.