MP Bharat: రాజమండ్రి స్వచ్చత.. ప్రతీ ఒక్కరి బాధ్యత
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్వచ్చతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్.. చీపురు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్వచ్చతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్.. చీపురు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు.
సీఎం జగన్‌పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి జరుగలేదని జగన్‌కు తెలిసి కూడా చంద్రబాబును అరెస్ట్ చేయించారన్న ఆయన.. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌కు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేక పోతున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పాలన విశాఖ నుంచి చేసేందుకు ముహుర్తం ఖరారు అయింది. అక్టోబర్ 22న విశాఖకు సీఎం జగన్ వెళతారని...అక్టోబర్ 23న సీఎం కార్యాలయంలో అడుగుపెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కార్యాలయం పనులు చివరి దశకు చేరుకున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.
పోలీసులపై జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇంఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జనసేన నేతలను ఉగ్రవాదులుగా చూస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ అధికారులమని చెప్పుకుటూ డ్రెస్ కోడ్ లేకుండా, సెర్చ్ వారెంట్ కూడా లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు.
ఇన్ని రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కులగణన ప్రధానమైన అంశమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. 1931 తర్వాత జరిగిన జనగణనలో కులగణన జరగలేదన్నారు. అనేక మంది విప్లవకారులు సాధించలేనిది సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్క సంతకంతో సాధించి చూపించారన్నారు.
ఏపీలో జీపీఎస్ విధానాన్ని తీసుకురావడంపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పాత పెన్షన్ విధానం అమలు చేస్తే 2050 నాటికి 49 వేల కోట్ల వ్యయం అవుతుందన్నారు. స్థూల ఉత్పత్తిలో పెన్షన్ వ్యయం 107 శాతానికి వెళ్తుందని మత్రి అంచనా వేశారు. ఇది ఒక దశకు వచ్చే సరికి ఆర్థిక వ్యవస్థ మొత్తం స్థంభించి పోయే పరిస్థితి వస్తుందని బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ తిరిగి రానున్నారు. దాంతో పాటూ ఎల్లుండి నుంచి యువగళం తిరిగి ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీకి మరో షాక్ తప్పదా..? ఏపీ రాగానే నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తారా.? లేదా ఆయన యువగళం పాదయాత్ర తిరిగి మొదలు అవుతందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఐదు రోజులపాటూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఆరు నెలలు ప్రజల్లోనే ఉండాలని నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.