అనంతపురంలో రచ్చకెక్కిన వైసీపీ వర్గ పోరు.!
అనంతపురం జిల్లా ముదిగుబ్బలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత నారాయణరెడ్డికి చెందిన ఇన్నోవా కారును తగలబెట్టారు మరో వర్గం నేతలు. దీంతో, వైసీపీ వర్గ పోరు రచ్చకెక్కింది. ఇసుక రీచ్ వాటాల పంపకంలో తేడాలు రావడంతోనే ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.