Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..
హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, గోల్కొండ, ఫిల్మ్‌నగర్, గచ్చిబౌలి సహా పలుప్రాంతాల్లో వర్షం పడుతోంది. రోడ్లపై వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.