AP: రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షం.. ప్రయాణికులు ఏం చేశారంటే..!
అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం కూడూరు సమీపంలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడి ఉంది. దీంతో ఏజెన్సీ గ్రామాలకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. గోకవరం నుండి పాతకోట వెళ్తున్న బస్సులోని ప్రయాణికులు చెట్టును తొలగించేందుకు ప్రయత్నాలు చేశారు.
AP: నాలుగో పెళ్లి చేసుకున్న దొంగమొగుడు.. విడాకులు కావాలంటున్న మూడో భార్య..!
విశాఖలో నిత్య పెళ్లికొడుకుపై మూడో భార్య కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని తనను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అడిగితే తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేసి ఆదుకోవాలని కలెక్టర్ వద్ద వేడుకొంది.
AP: ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఇలా ఆదేశించారు: దాడి రత్నాకర్
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నడుంబిగించారన్నారు టీడీపీ నేత దాడి రత్నాకర్. అనకాపల్లి జిల్లాలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించేందుకు సర్వే నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారన్నారు. పలు అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ చేయాలని ఆదేశించారని తెలిపారు.
AP: ఇంజక్షన్ రియాక్షన్.. 24 మందికి సీరియస్..!
విశాఖ నక్కపల్లి ఆస్పత్రిలో హై టెన్షన్ నెలకొంది. పలు సమస్యలతో రెండ్రోజుల క్రితం ఇన్పేషెంట్స్గా చేరిన 24మంది బాధితులకు సెఫోటాక్సిన్ ఇంజక్షన్ రియాక్షన్ ఇచ్చింది.పేషెంట్లకు తీవ్రంగా చలి జ్వరం, వాంతులు అయ్యాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
AP: పసిబిడ్డను చూసేందుకు వచ్చిన తండ్రి.. అప్పుడే అనంతలోకాలకు..!
AP: విశాఖ జిల్లా అగనంపూడి జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. సూర్య కిరణ్ అనే వ్యక్తిని గంగవరంకు చెందిన కోర్లయ్య కత్తితో దాడి చేసి చంపాడు. భార్య బిడ్డలను చూసి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కోర్లయ్యకు, సూర్య అత్తకు అక్రమ సంబంధం ఉన్నట్టు అనుమానం.
AP: విశాఖలో కిడ్నీ రాకెట్ కేసు.. ఎన్.అర్.ఐ ఆసుపత్రికి బిగుస్తున్న ఉచ్చు..!
విశాఖ ఎన్.అర్.ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తోంది. కిడ్నీ మార్పిడి చేస్తామని ఓ వ్యక్తి దగ్గర అడ్వాన్స్ కింద రూ. 10 లక్షలు వసూల్ చేసి మొహం చాటేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ కేసులో సీపీ దూకుడు పెంచారు. నిందితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
AP: అసలు ఈ హాస్పిటల్ ఎందుకు కట్టారో: ఎమ్మెల్యే విజయ్
అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని హాస్పిటల్ గత ప్రభుత్వ శిలాఫలకాలకు మాత్రమే ఉపయోగపడిందన్నారు ఎమ్మెల్యే విజయ్ కుమార్. కేవలం 30 శాతం పనులు పూర్తిచేసి హాస్పిటల్ ను ఇక్కడికి షిఫ్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన సౌకర్యాలతో హాస్పటల్ ను తీర్చిదిద్దుతామని అన్నారు.
AP: శారదా పీఠం స్వరూపానంద కార్యకలాపాలపై విచారణ చేయాలి: దళిత సంఘాలు
విశాఖ జిల్లా భీమిలిలో శారదా పీఠానికి గత ప్రభుత్వంలో ఇచ్చిన విలువైన భూములను కొత్త ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. శారదా పీఠం స్వరూపానంద కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rain-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/vishaka-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/tree.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/third-wife.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/tdp-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/hospital.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kamareddy_-A-man-was-brutally-murdered-in-Sirpur.-The-reason-was-extramarital-affair-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/NRI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/mla-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/vishaka-2-1.jpg)