ఇది సబ్ వే కాదు.. రెజ్లింగ్ రింగ్ అంతకన్నా కాదు.. ఇదేం తన్నుకోవడం బాబోయ్..!!
ఈ మధ్య రైల్లో తరచుగా గొడవలు..జుట్టు పట్టి కొట్టుకోవడం..ఇలాంటి ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. మొన్న ముగ్గురు మహిళలు సీటుకోసం జుట్టుపట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న ఘటన చూశాం. ఇవన్నీ ఇండియాలోనే. కానీ న్యూయార్క్ లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. కదులుతున్న రైలులో తన పక్కనే కూర్చున్న ఓ ప్రయాణికుడిని మోచేతితో కొట్టిన వీడియో వైరల్ గా మారింది. బాధితుడు ఎలాంటి తప్పు చేయకుండానే మోచేతితో తీవ్రంగా కొట్టాడంటూ వాపోయాడు.