Ambati rambabu: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్గించాలని చూస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరొపించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో తిరుగుతున్న నేతలు ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం రాదేమో అనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.