మణిపూర్ లో ఆగని హింస.... 24 గంటల్లో ఆరుగురు మృతి....!
మణిపూర్లో చెలరేగిన హింస ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఆరుగురు మరణించారని అధికారులు వెల్లడించారు. శనివారం తెల్లవారు జామున బిష్ణుపూర్ జిల్లాలో ఓ వర్గం వారిపై ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. చురచాంద్ పూర్ నుంచి వచ్చిన వాళ్లే ఈ ఘటనకు కారణమని అధికారులు తెలిపారు.