Crime News: మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వ్యక్తిపై కత్తులతో దాడి!!
కృష్ణా జిల్లా పెడనలో ఓ వ్యక్తి పై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దారుణంగా దాడి చేశారు. కప్పల దొడ్డికి చెందిన పంతం బలరాం అనే వ్యక్తి మంగళవారం ఉదయం రోజూ లాగే మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఇద్దరు యువకులు అకస్మాత్తుగా వచ్చి బలరాంపై కత్తులతో దాడికి దిగారు. దీంతో తీవ్ర గాయాల పాలైన బలరం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బలరాంను స్థానికులు మచిలీ పట్నలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బలరాం నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. తనపై యర్రా దేవన్, యర్రా జీవన్ లు కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డాడని బలరాం వెల్లడించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.