ఆంధ్రప్రదేశ్ CM Jagan: పంద్రాగష్టు వేడుకల్లో ఆసక్తికర ఘటన.. కింద పడిన మెడల్ తీసిన సీఎం జగన్ 77వ స్వాతంత్ర్య దినోత్స వేడుకలు అంబరాన్నంటాయి. దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్స వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పంద్రాగష్టు వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సీఎం జగన్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు మెడల్స్ ప్రదానం చేశారు సీఎం. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు మెడల్స్ ప్రదాన సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గ్రే హౌండ్స్ కు చెందిన గౌరు నాయకుడుకు మెడల్ ప్రధానం చేశారు సీఎం జగన్. ఆ తర్వాత గౌరు నాయుడు సెల్యూట్ చేస్తుండగా బహుకరించిన మెడల్ కిందపడటంతో.. సీఎం జగన్ వెంటనే కింద పడిన మెడల్ ను తీసి మళ్లీ.. సంబంధిత వ్యక్తికి ప్రదానం చేశారు. దీంతో గౌరు నాయుడు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Independence Day 2023: ఏపీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగరేసిన ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగష్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో జాతీయ జెండాను ఎగురవేసి.. వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు పంట బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా ఇస్తున్నామన్నారు. అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుకు అండగా నిలుస్తాన్నమన్నారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగష్టు 15 వేడుకులకు సర్వం సిద్ధమైంది. స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 9 గంటలకు ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇప్పటికే ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను కూడా స్టేడియంలో సిద్ధం చేశారు. శకటాల ప్రదర్శనను తిలకించిన సీఎం జగన్.. అనంతరం పలువురికి అవార్డులను అందజేస్తారు. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ములిద్దరూ కూడా ప్యాకేజీ స్టార్లే..వారి మాటలు నమ్మకండి! పవన్ ఓ ప్యాకేజీ స్టార్..ఆయనకు సిగ్గు, బుద్ది రెండు లేవు. మందు తాగి వచ్చాడో, డ్రగ్స్ కొట్టి వచ్చాడో తెలియదు కానీ ఏదేదో వాగాడు అంటూ జనసేన అధినేత పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. By Bhavana 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో దారుణం.. కూతురు ప్రేమకి.. తల్లి బలి!! విజయవాడలోని భవానీపురంలో లలిత అనే మహిళ తన భర్త, కుమార్తెతో నివసిస్తోంది. తనకు ఒక్కగానొక్క కూతుర్ని ఎంతో అల్లారు ముద్దగా పెంచుతూ.. తన కాళ్ల మీద తాను నిలబడేలా ఎంబీఏ వరకూ చదివించారు. దీంతో ఆమెకి హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత తాను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతడ్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని పేరెంట్స్ కి చెప్పింది. పేరెంట్స్ కూడా తన ప్రేమని ఒప్పుకోవడం లేదని.. ప్రేమించిన అబ్బాయితో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది యువతి. దీంతో తల్లి లలిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. By E. Chinni 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నందిగామలో కేశినేని నాని భారీ ర్యాలీ.. దూరంగా మాజీ ఎమ్మెల్యే తాజాగా నందిగామలో కార్యకర్తలతో కేశినేని నాని భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో కేశినేని నానికి ధీటుగా చిన్ని వర్గీయులు కూడా పోటా పోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా కేశినేని నానికి, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మధ్య దూరం మరింత పెరిగింది. కేశినేని నాని నందిగామ నియోజకవర్గ పర్యటనకు హాజరు కాని మాజీ ఎమ్మెల్యే సౌమ్య... By E. Chinni 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇలాగే కాదు, ఇంకా ఆప్కాబ్ ను మెరుగుపరుస్తాం : ఏపీ సీఎం జగన్ రాష్ట్ర సహకార రంగం చరిత్రలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ఆప్కాబ్ షష్టిపూర్తి జరుపుకుంటోందని.. 60 ఏళ్ల ప్రయాణంలో ఆప్కాబ్ రైతులకు అండగా నిలబడిందన్నారు. భారత రైతు అప్పుల్లోనే పుడతాడు.. అప్పుల్లోనే బతుకుతాడు చివరికి అప్పుల్లోనే చనిపోతడాని ఓ నానుడి ఉండేదని.. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ రైతులకు దగ్గరకు అడుగులు వేడయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆప్కాబ్ ను... By E. Chinni 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో సబ్సీడీపై కిలో రూ.50కే టమాటాలు.. బారులు తీరిన జనం.. కట్ చేస్తే!! ప్రస్తుతం విజయవాడలోని అన్ని ప్రధాన రైతు మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. సబ్సీడీపై ఒక మనిషికి రెండు కిలోల టమాటాలు మాత్రమే ఇస్తున్నారు. ఆ టమాటాల కోసం పనులన్నీ మానేసుకుని మార్కెట్లలో పడిగాపులు కాస్తున్నారు పబ్లిక్. ఒకప్పుడు రేషన్ షాపు ముందు, నీళ్ల కోసం ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నామో.. అదే ఇప్పుడు టమాటాలకు కూడా ఎదురయ్యిందని జనం మాట్లాడుకుంటున్నారు. తీరా గంటల తరబడి క్యూ లైన్ లలో వేచి ఉండి తీసుకున్న టమాటాలు.. By E. Chinni 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Justice Dheeraj Singh Takor) శుక్రవారం (28-07-2023) రోజున ప్రమాణ స్వీకారం చేశారు.జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో ఏపీ గవర్నర్ (AP Governor) అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.ప్రమాణం చేసిన అనంతరం నూతన ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం ఇచ్చి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను శాలువా పుష్పగుచ్ఛంతో సీఎం జగన్ (CM Jagan) సన్మానించారు. By Shareef Pasha 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn