High Tension At Vijayawada Kanakadurga Temple | దుర్గ గుడిలో ఉద్రిక్తత | Dussehra 2024 | RTV
విజయవాడ కనకదుర్గమ్మ దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవీ అవతారంలో దర్శనమిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల సమస్యలు అన్ని తొలగి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
విజయవాడ ఇంద్రకీలాద్రీ పై జరిగే నవరాత్రుల సందర్భంగా భక్తుల కోసం దేవస్థానం సిబ్బంది ‘దసరా 2024’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దర్శన వేళలు.. టికెట్ల కౌంటర్లు.. పార్కింగ్ ప్రదేశాలు తదితర వివరాలను ఈ యాప్ లో అందుబాటులో ఉంచారు.
విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. గుడిలోని కేశఖండనశాల పక్కన ఉన్న కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆ సమయయంలో కొంతమంది పాదచారులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మూడు బైక్స్ ధ్వంసం అయినట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు కూడా జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఈ క్రమంలోనే బెజవాడ కనక దుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు.