Kushi Movie: సమంత, విజయ్ దేవరకొండ సినిమా ''ఖుషి" పై బజ్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 9 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్నిదర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందీ సినిమా.