AP High Court: భక్తుల కోసం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి.. టీటీడీకి హైకోర్టు ఆదేశం
అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారిలో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనే పిటిషన్ పై బుధవారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వి చారణ జరిగింది. టీటీడీ మాజీ మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తిరుమల కాలిబాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ శాఖ, తిరుమల తిరుపతి దేవాస్థానం అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారనే అంశంపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.