వీక్ డేస్ లోనూ తగ్గని తిరుమల శ్రీవారి రద్దీ!
వారాంతంలోనే అనుకుంటే వారం మధ్య రోజుల్లో కూడా తిరుమల శ్రీవారి రద్దీ తగ్గడం లేదు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.
వారాంతంలోనే అనుకుంటే వారం మధ్య రోజుల్లో కూడా తిరుమల శ్రీవారి రద్దీ తగ్గడం లేదు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.
తిరుమల తిరుపతి పాలకమండలి పదవీకాం రేపటితో ముగుస్తుంది. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలో ఇవాళ చివరి సమావేశం జరుగనుంది. టీటీడీ కొత్త ఛైర్మన్గా భూమన కరుణాకర్రెడ్డిని ప్రభుత్వం ఇప్పటికే నియమిస్తూ జీవో జారీ చేసింది. వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే రెండు సార్లు.. నాలుగేళ్ల కాలం పాటు టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక, ఈ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే భక్తులు నమ్మవద్దని సూచించారు. సేవ సాఫ్ట్ వేర్ ఖచ్చితంగా ఉంటుందని.. దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరని ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి సేవ చేస్తున్న మహిళలను గౌరవప్రదంగా 'అమ్మ' అని పిలవాలన్నారు. సేవ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్, లక్కీ డిప్ విధానం, తిరుమల సీఆర్వో వద్ద ఒకరోజు ముందుగా పేర్లను నమోదు చేసుకుంటే డిప్ ద్వారా సేవా టికెట్లు కేటాయించబడుతుందని చెప్పారు. అలాగే ప్రతిరోజు ఆన్ లైన్ లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 15 వేలు, ఎస్ ఎస్ డి టోకెన్లు 15 వేలు, దివ్యదర్శనం టోకెన్లు 15 వేలు తిరుపతిలో కేటాయిస్తున్నామని..