Thyroid: చిన్న వయసులోనే థైరాయిడ్ ఎందుకు వస్తుంది?..లక్షణాలేంటి?
ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే థైరాయిడ్ బారినపడుతున్నారు. చాలా సందర్భాల్లో థైరాయిడ్ లక్షణాలు బయటపడవు. శరీరం లోపల అంతర్గతంగా వ్యాధి వృద్ధి చెందుతూ ఉంటుంది. సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.