Telangana: అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్-వద్దన్న ఓవైసీ
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు.డిప్యూటీ సీఎం పదవితోపాటు ఏకంగా తన పక్కనే కూర్చొబెట్టుకుంటానని చెప్పారు. దీనికి ఓవైసీ తాను ఎంఐఎం పార్టీలో సంతోషంగా ఉన్నానంటూ సమాధానం ఇచ్చారు.