Telangana: తెలంగాణ కాంగ్రెస్కు డీకే శివకుమార్ షాక్.. ఆ ఒక్క ప్రకటనతో..
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చారు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్. విద్యుత్ సరఫరాపై ఆయన చేసిన కామెంట్స్.. టి. కాంగ్రెస్ నేతలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇక్కడి నేతలు తాము గెలిస్తే రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామంటుంటే.. డీకే శివకుమార్ మాత్రం కర్ణాటకలో 5 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నామని ప్రకటించి బాంబ్ పేల్చారు. డీకే వ్యాఖ్యలతో కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు.