Telangana: బండి వర్సెస్ ఈటల.. ఆ మూడు సీట్ల కోసం ఫైట్!
తెలంగాణ బీజేపీలో టికెట్ల పంచాయితీ నడుస్తోంది. సంగారెడ్డి, వేములవాడ, హుస్నాబాద్ సీట్ల కోసం బండి సంజయ్ కుమార్, ఈటల రాజేందర్ పట్టుబడుతున్నారట. అస్సలు వెనక్కి తగ్గడం లేదట.
తెలంగాణ బీజేపీలో టికెట్ల పంచాయితీ నడుస్తోంది. సంగారెడ్డి, వేములవాడ, హుస్నాబాద్ సీట్ల కోసం బండి సంజయ్ కుమార్, ఈటల రాజేందర్ పట్టుబడుతున్నారట. అస్సలు వెనక్కి తగ్గడం లేదట.
హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు కేఎల్ఆర్, పారిజాత నర్సింహారెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.
తెలంగాణ బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. వరంగల్ వెస్ట్ టిక్కెట్ ఆశించిన రాకేష్‌రెడ్డి.. టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. పొమ్మనలేక పొగబెట్టారని, బీజేపీలో అన్నీ అవమానాలే అని అన్నారాయన.
తెలంగాణలో అందరి దృష్టి ఇప్పుడు గజ్వేల్ పైనే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా ఆయనపై పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఇక గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే అయిన తూంకుంట నర్సారెడ్డి సైతం గట్టి పోటీ ఇస్తుండటంతో.. ఈసారి మరింత ఇంట్రస్ట్ క్రియేట్ అవుతోంది.
నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించకపోవడంతో ఆగ్రహంగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు.. త్వరలోనే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి, మంచి ముహూర్తం చూసుకుని గులాబీ కండువా కప్పుకుంటానని చెప్పారు. కాగా, నాగం జనార్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆయన్ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించారు. పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని కోరారు కాసాని. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఏపీపైనే దృష్టి పెట్టింది. దీంతో తెలంగాణపై ఫోకస్ చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని తెలంగాణ నేతలకు చంద్రబాబు సూచించారని తెలుస్తుంది.
నల్లగొండ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తాజాగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాన అనుచరులు దేవరకొండ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, ఎంపీపీ జాన్ యాదవ్, సిరందాస్ కృష్ణయ్య, లక్ష్మమ్మ, కృష్ణయ్య, వడ్త్యా దేవేందర్ నాయక్ సహా పలువురు కాంగ్రెస్‌లో చేరారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చారు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్. విద్యుత్ సరఫరాపై ఆయన చేసిన కామెంట్స్.. టి. కాంగ్రెస్ నేతలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇక్కడి నేతలు తాము గెలిస్తే రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామంటుంటే.. డీకే శివకుమార్ మాత్రం కర్ణాటకలో 5 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నామని ప్రకటించి బాంబ్ పేల్చారు. డీకే వ్యాఖ్యలతో కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు.
తెలంగాణ కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించడమే ఆలస్యం.. సీటు దక్కని అభ్యర్థులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీ భవన్లో వీరంగం సృష్టించారు. జూబ్లీహిల్స్ టికెట్‌ను అజారుద్దీన్‌కు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఈ క్రమంలో గాంధీ భవన్‌పై రాళ్లు, ఇటుకలు రువ్వారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను చించేసి నానా రచ్చ చేశారు. వీరొక్కరే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టికెట్ దక్కని కాంగ్రెస్ నేతలు తమ నిరసన గళం వినిపిస్తున్నారు.