Telangana: పొంగులేటికి ముందే ఎలా తెలుసు? ఐటీ దాడులపై కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్..
తనపై ఐటీ దాడులు జరుగుతాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెండు రోజుల ముందే ఎలా తెలుసు? అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఐటీ దాడులకు బీజేపీకి సంబంధమే లేదన్నారు. ఐటీ అధికారులు వారి పని వారు చేసుకుంటున్నారని తెలిపారు.